ETV Bharat / state

YV Subba Reddy: 'ప్రజల కోసమే అప్పులు.. తీర్చే సత్తా ఏపీ ప్రభుత్వానికి ఉంది' - ap news

ప్రజల సంక్షేమం కోసమే అప్పులు చేస్తున్నామని.. వాటిని తీర్చే సత్తా కూడా వైకాపా ప్రభుత్వానికి ఉందన్నారు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ttd chairman yv subba reddy news). ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

yv subba reddy
yv subba reddy
author img

By

Published : Oct 5, 2021, 8:42 PM IST

'ప్రజల కోసమే అప్పులు.. తీర్చే సత్తా ఏపీ ప్రభుత్వానికి ఉంది'

ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం అప్పులు చేయడం జరుగుతుందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ttd chairman yv subba reddy news) అన్నారు. ఏపీలో ఉన్న వనరులను అభివృద్ధి చేస్తామని.. అప్పులు తీర్చే సత్తా వైకాపా ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రూ. 7.7 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాలను మంత్రులు పెద్దిరెడ్డి, వేణుగోపాలకృష్ణ, కన్నబాబులతో కలిసి ప్రారంభించారు. అనంతరం డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

పవన్​పై సెటైర్లు

ఏపీ మంత్రులపై... జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan comments on ministers news) చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఆరోపణలు చేసి మళ్లీ వెళ్లిపోతారంటూ సెటైర్లు వేశారు(ttd chairman yv subba reddy comments on pawan). వైకాపా ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు.. నిత్యం ప్రజల్లో ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని.. దీనిపై సీఎం జగన్(ap cm jagan) ఇప్పటికే ఆదేశాలిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. ఏ ప్రభుత్వ హయాంలోనూ అమలు చేయలేదన్నారు.

ఇదీ చూడండి: BANDI SANJAY: 'కాళోజీ హెల్త్​ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను పరిశీలిస్తామన్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.