ETV Bharat / state

ఆలయంపై డ్రోన్​ చిత్రీకరణకు అవకాశం లేదు: టీటీడీ ఛైర్మన్​ - నేటి తెలుగు వార్తలు

TTD on Tirumala Drone Visuals: ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి డ్రోన్​ దృశ్యాలు కలకలం సృష్టించాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్​ స్పందించారు. వారు ఏమన్నారంటే..

TTD chairmen YV Subbareddy
టీటీడీ ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి
author img

By

Published : Jan 21, 2023, 3:55 PM IST

TTD on Tirumala Drone Visuals: ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల ఆలయం డ్రోన్​ దృశ్యాలపై టీటీడీ ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. హైదరాబాద్​కు చెందిన ఓ సోషల్​ మీడియా సంస్థ.. డ్రోన్​ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో ప్రసారం చేసినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ఆ సంస్థపై కేసు నమోదు చేస్తామని అన్నారు. పటిష్ట భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్​ చిత్రీకరణకు అవకాశం లేదని.. గతంలో తీసిన చిత్రంతో యానిమేట్​ చేసి దృశ్యాలు తయారు చేశారా అనే కోణంలో విచారిస్తామని పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణకు అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. డ్రోన్​ దృశ్యాలు, చిత్రాలపై భక్తులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదనే నిబంధన ఉంది. అలాగే నో ఫ్లై జోన్‌ కావటంతో.. ఈ దృశ్యాలు ప్రసారం కావటంతో పలు విమర్శలు వస్తున్నాయి. శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలకు సంబంధించిన దృశ్యాలలో చిత్రీకరించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.