ETV Bharat / state

TSSPDCL: 'వర్షాల దృష్ట్యా ప్రజలు స్వీయ భద్రతా చర్యలు పాటించాలి' - telangana varthalu

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టీఎస్​ఎస్పీడీసీఎల్​ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సీఎండీ రఘుమారెడ్డి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ప్రజలు తగు స్వీయ భద్రతా చర్యలు పాటించాలని సీఎండీ కోరారు.

TSSPDCL: 'వర్షాల దృష్ట్యా ప్రజలు స్వీయ భద్రతా చర్యలు పాటించాలి'

author img

By

Published : Sep 3, 2021, 4:57 AM IST

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అప్రమత్తమైంది. ఎస్పీడీసీఎల్​ పరిధిలోని సీజీమ్,సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సీఎండీ రఘుమారెడ్డి ఫోన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ప్రజలు తగు స్వీయ భద్రతా చర్యలు పాటించాలని సీఎండీ కోరారు. వంగిన, కూలిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని సూచించారు. కింద పడ్డ, వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాకడం, వాటిమీద నుంచి వాహనాలతో డ్రైవ్ చేయడం, వైర్లను తొక్కడం చేయరాదన్నారు.

రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి పోవద్దన్నారు. విద్యుత్ స్తంభాలకు, స్టే వైర్లకు పశువులను కట్టరాదని తెలిపారు. వర్షం పడేటప్పుడు, తగ్గిన తరువాత పశువులను విద్యుత్ వైర్లకు, ట్రాన్స్​ఫార్మర్లకు దూరంగా తీసుకెళ్లాలని, ఇలాంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. చెట్ల మీద, వాహనాల మీద విద్యుత్ వైర్లు పడితే వాటిని తాకే ప్రయత్నం చేయొద్దన్నారు. విద్యుత్​కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌ను సంప్రదించాలని కోరారు. విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నెంబర్‌లకు ఫోన్‌ చేయాలని రఘుమారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: RAINS IN HYD: భాగ్యనగరంలో కుంభవృష్టి.. జనజీవనం అస్తవ్యస్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.