ETV Bharat / state

నయా ట్రెండ్​కు టీఎస్​ఆర్టీసీ నాంది.. త్వరలోనే మెట్రో తరహాలో స్మార్ట్ పాసులు - TSRTC to Launch Smart Card System

TSRTC Smart cards: టిక్కెట్లు, పాసుల జారీలో స్మార్ట్‌ శకానికి టీఎస్​ఆర్టీసీ శ్రీకారం చుట్టనుంది. టికెట్‌ జారీకి ఐటిమ్స్‌ యంత్రాలు తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. మొబైల్​ యాప్​ ద్వారా బస్​ పాసులను జారీ చేయాలని నిర్ణయించుకుంది. మెట్రో తరహాలో స్మార్ట్ పాసులను ప్రయోగాత్మకంగా హైదరాబాద్​ సిటీలో ప్రారంభించనున్నారు.

TSRTC Intelligent Ticket Machines
టీఎస్​ఆర్టీసీ
author img

By

Published : Nov 9, 2022, 8:25 AM IST

TSRTC Smart cards : టిక్కెట్లు, పాసుల జారీని సరళతరం చేసేలా.. స్మార్ట్‌ శకానికి టీఎస్​ఆర్​టీసీ శ్రీకారం చుట్టనుంది. చిల్లర సమస్య, లెక్కల్లో తేడాలు వంటి చిక్కుముడులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న టికెట్‌ జారీ యంత్రాలు టిమ్స్‌ స్థానంలో.. ఇంటెలిజెంట్‌ టికెట్‌ జారీ యంత్రాలు-ఐటిమ్స్‌ను తీసుకురానుంది. మొబైల్‌ యాప్‌ ద్వారా బస్‌ పాసులను జారీ చేయాలని నిర్ణయించింది. మెట్రో రైళ్ల తరహాలో స్మార్ట్‌ కార్డులను ప్రవేశపెట్టనుంది.

TSRTC to Launch Smart Card System : వీటిని ఆర్టీసీ కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. ఆన్‌లైన్‌లోనే రీఛార్జ్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ కార్డులొస్తే ప్రతిసారీ టికెట్‌ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కార్డులో ఉన్న మొత్తం నుంచి ఛార్జీ సొమ్ము మినహాయించుకుని.. టికెట్లు ఇస్తారు. తొలి దశలో గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 3,087 సర్వీసుల్లో 3,500 ఐటిమ్స్‌ యంత్రాలను వినియోగిస్తారు.

ఇక్కడ విజయవంతమైన తీరును బట్టి దశలవారీగా రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. ఆర్టీసీలో సొంత, అద్దె బస్సులు కలిపి 9,321 ఉన్నాయి. 10 వేల ఐటిమ్స్‌ అవసరమని అంచనా వేశారు. ఐటిమ్స్‌ యంత్రాలు, స్మార్ట్‌ కార్డులు, మొబైల్‌ యాప్‌ సాంకేతికత కోసం ఆర్టీసీ తాజాగా టెండర్లు ఆహ్వానించింది. స్మార్ట్‌వ్యవస్థను మార్చిలోపు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.