ETV Bharat / state

టీఎస్​ఆర్టీసీ గుడ్​ న్యూస్.. మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు - Mahashivratri puja 2023

TSRTC Special Buses For Mahashivratri: మహాశివరాత్రి పండుగ సందర్బంగా భక్తులకు టీఎస్​ఆర్టీసీ గుడ్​ న్యూస్ చెప్పింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి.. 40 శైవక్షేత్రాలకు.. 2,427 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

TSRTC
TSRTC
author img

By

Published : Feb 13, 2023, 7:17 PM IST

TSRTC Special Buses For Mahashivratri: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం 2,427 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం క్షేత్రానికి 578 బస్సులు, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, అలంపూర్‌కు 16, రామప్పకు 15, ఉమా మహేశ్వరానికి 14 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ కాలనీ, బీహెచ్‌ఈఎల్‌ నుంచి పత్యేక బస్సులు అందుబాటులో ఉంచామని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఈ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోందని.. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఇవీ చదవండి: TSRTC Special Offer: శుభకార్యాల కోసం అద్దెకు తీసుకునే బస్సులపై 10% డిస్కౌంట్

'గ్రూప్​-1 మెయిన్స్ పరీక్షలో.. ఆంగ్లంతో పాటు తెలుగును అర్హత పరీక్షగా ప్రవేశపెట్టాలి'

మందుబాబులకు వింత శిక్ష.. స్టేషన్​లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్.. ఏం రాయించారంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.