ETV Bharat / state

TSRTC Special Buses For Dussehra Festival : దసరా స్పెషల్.. 13వ తేదీ నుంచి 5,265 ప్రత్యేక బస్సులు - TSRTC Special Buses For Dussehra Festival 2023

TSRTC Special Buses For Dussehra Festival 2023 : బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పండుగల వేళ సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5వేల 265 ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్టోబర్‌ 13 నుంచి 25 తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నారు. హైదరబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.

Dussehra Festival 2023
TS RTC Special Buses For Dussehra Festival
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 8:39 AM IST

TSRTC Special Buses For Dussehra Festival దసరా స్పెషల్.. 13వ తేదీ నుంచి 5,265 ప్రత్యేక బస్సులు

TSRTC Special Buses For Dussehra Festival 2023 : దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరా పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక బస్సుల్లోనూ ఆర్టీసీ సాధారణ చార్జీలే వసూలు చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.

Telangana RTC Special Buses On Dussehra Festival : అక్టోబరు 13నుంచి 25వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్,లతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే కేపీఎచ్​బీ కాలనీ, ఉప్పల్‌ క్రాస్‌రోడ్డు, దిల్‌సుఖ్‌నగర్‌, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్- ఉప్పల్‌, ఎంజీబీఎస్ - జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్‌ మార్గాల్లో పది నిమిషాలకో సిటీ బస్సు తిరుగుతుందని ఆర్టీసీ వెల్లడించింది.

TS RTC Call Center : మెరుగైన సేవల కల్పనే లక్ష్యంగా... హైటెక్​ తరహాలో ఆర్టీసీ కాల్​ సెంటర్​

TSRTC Online Booking : సద్దుల బతుకమ్మ, మహర్నవమి, దసరాకు ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించింది. అక్టోబరు 21 నుంచి 23 వరకు రెగ్యులర్‌, స్పెషల్‌ సర్వీసులు ఎంజీబీఎస్ నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి నడవనున్నాయి.

ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కడప, ఒంగోలు వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి వెళ్లనున్నాయి. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ బస్సులు జేబీఎస్, పికెట్‌ నుంచి వెళ్తాయి. వరంగల్‌, మహబూబాబాద్‌, తొర్రూరు, యాదగిరి గుట్ట బస్సులు ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్‌, ఉప్పల్‌ బస్టాండ్‌ నుంచి నడుస్తాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్‌ నుంచి వెళ్లనుండగా మిగతా సర్వీసులు ఎంజీబీఎస్ నుంచి నడువనున్నాయి.

Telangana RTC Special Buses for Women : టీఎస్​ఆర్టీసీ మరో గుడ్​న్యూస్.. ఆ రూట్​లో మహిళల కోసం ప్రత్యేక బస్సు

ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. గతేడాది దసరాతో పోలీస్తే ఈసారి దాదాపు వెయ్యి బస్సులను అదనంగా నడుపుతున్నట్లు వివరించారు. రిజర్వేషన్‌ సర్వీసులను 535కి పెంచామన్న యాజమాన్యం ప్రత్యేక బస్సులకు సైతం సాధారణ ఛార్జీలకు మించి ఒక్క రూపాయి అదనంగా వసూలు చేయబోమని వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవాలన్న సజ్జనార్‌ స్పెషల్‌ సర్వీసులు వివరాల కోసం టీఎస్ఆర్టీసీ కాల్‌సెంటర్లలో సంప్రదించాలని సూచించారు.

TSRTC Electric Bus : ఆగస్టు నెలాఖరు నాటికి భాగ్యనగర రోడ్లపై మరో 25 ఈవీ బస్సుల రయ్​.. రయ్​.. ఈ విషయాలు తెలుసుకోండి

ప్రయాణికులకు గుడ్ న్యూస్​​.. సాధారణ చార్జీలతోనే స్పెషల్ బస్సులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.