TSRTC Special Buses For Bathukamma and Dussehra Festival From Today : దసరా స్పెషల్‌గా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రారంభించింది. ఈ నెల 25వ తేదీ వరకు 5,265 అదనపు బస్సు సర్వీసులు నడపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఏ.శ్రీధర్ తెలిపారు. గురువారం ఎంజీబీఎస్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు.
TSRTC Dussehra special buses started From Today : దసరా, బతుకమ్మ పండగలకు అన్ని ప్రాంతాలకు ఎంజీబీఎస్ నుంచే బస్సు సర్వీసులను నడపడంతో.. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం, ఆరాంఘర్, ఉప్పల్ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల నుంచి సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రవాణాశాఖ, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సహకారంతో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎం వివరించారు.
-
బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5,265 ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. ఈ నెల 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. రిజర్వేషన్ కోసం సంస్థ… pic.twitter.com/RWEmodv9Cv
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5,265 ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. ఈ నెల 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. రిజర్వేషన్ కోసం సంస్థ… pic.twitter.com/RWEmodv9Cv
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 6, 2023బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5,265 ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. ఈ నెల 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. రిజర్వేషన్ కోసం సంస్థ… pic.twitter.com/RWEmodv9Cv
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 6, 2023
బస్సుల్లో లగేజీకి ప్రత్యేక రాయితీ : దసరా పర్వదినాలను పురస్కరించుకుని నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులు వెంట తీసుకెళ్లే 50 కేజీలపైన లగేజీకి విధించే ఛార్జీలు తగ్గనున్నాయి. ఆ ఛార్జీల్లో 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ ఎ. పురుషోత్తంనాయక్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ మహానగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
DA For TSRTC Employees : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 4.8 శాతంతో మరో డీఏ మంజూరు
Telangana RTC Special Buses On Dussehra Festival : హైదరాబాద్‌లోని ప్రధాన బస్ స్టాండ్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్లతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీకాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్డు, దిల్సుఖ్నగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్- ఎల్బీనగర్, ఎంజీబీఎస్- ఉప్పల్ మార్గాల్లో పది నిమిషాలకు ఒక సిటీ బస్సు తిరుగుతుందని టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారహు.
TSRTC Online Booking : ఈ నెలలోనే సద్దుల బతుకమ్మ, మహర్నవమి, దసరాకు ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో.. అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు నడిపేందుకు వీలుందని సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, కడప, ఒంగోలు వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి వెళ్తున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వెళ్లే బస్సులు జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తున్నాయి. వరంగల్, తొర్రూరు, మహబూబాబాద్, యాదాద్రి వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్‌స్టాండ్ నుంచి నడుస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి వెళ్లగా.. మిగిలిన సర్వీసులు ఎంజీబీఎస్ నుంచి వెళ్తున్నాయి.
TSRTC Gamyam App : మీ బస్సు ఎక్కడుందోనని ఆగం కాకండి.. ఈ 'గమ్యం'తో చిటికెలో తెలుసుకోండి..