ETV Bharat / state

RTC- Railway Transport: ఆర్టీసీ, రైల్వే సంయుక్త సరుకు రవాణా

RTC- Railway Transport: టీఎస్‌ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ విభాగంలో సమూల మార్పులు చేయడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టిసారించారు. రైల్వేతో కలిసి సరుకు రవాణాలో ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు.

RTC
RTC
author img

By

Published : Apr 16, 2022, 10:41 AM IST

RTC- Railway Transport: సరుకు రవాణాలో ఆర్టీసీ, రైల్వేలు కలసి సంయుక్తంగా ముందుకెళ్లనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన చేస్తోంది. టీఎస్‌ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ విభాగంలో సమూల మార్పులు చేయడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టిసారించారు. అందులో భాగంగా కార్గో విభాగానికి వ్యాపార నిర్వహణ ఇంఛార్జ్​గా జీవన్ ప్రసాద్​ను నియమించారు. కొంతకాలంగా సరుకు రవాణాను పటిష్టం చేసే దిశలో దక్షిణ మధ్య రైల్వే పకడ్బందీగా వ్యవహరిస్తోంది.

ఈమేరకు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో టీఎస్‌ఆర్టీసీతో కూడా ఒప్పందంపై ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం నిర్ధారిత స్టేషన్ల నుంచి సరుకు రవాణా అవుతోంది. ఆయా స్టేషన్​ల వరకు సరుకును బుక్‌ చేసినవారే తెచ్చి రైల్వేకు అప్పగించాల్సి ఉంది. దీనిని భర్తీ చేసేందుకు ఆర్టీసీ ముందుకొచ్చింది. పార్శిల్స్‌ బుక్‌ చేసుకున్న వారి ఇళ్లు, వ్యాపార కేంద్రాల వద్దకు ఆర్టీసీ కార్గో సిబ్బంది వెళ్లి సరుకును తీసుకువచ్చి..అందుకయ్యే ఖర్చును వసూలు చేస్తారు.

సరుకును నిర్ధారిత రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి రైల్వే సిబ్బందికి అప్పగిస్తారు. దీనివల్ల సరుకు బుక్‌ చేసుకున్న వారికి దాన్ని స్టేషన్‌ వరకు తరలించే భారం తప్పుతుంది. ఆ బాధ్యతను తీసుకున్నందుకు ఆర్టీసీ తన వంతు చార్జీలు తీసుకుంటుంది. దీనివల్ల రైల్వేకు సరుకు రవాణా పార్శిళ్ల సంఖ్య పెరిగి వ్యాపారం వృద్ధి చెందుతుందని.. తద్వారా ఆర్టీసీకి కూడా భారీ డిమాండ్‌ వస్తుందని ఆర్టీసీ భావిస్తుంది. ఇటీవలే కర్ణాటకలో, అక్కడి ఆర్టీసీ కార్గో విభాగం పని తీరును పరిశీలించి వచ్చిన ఆయన... తాజాగా రైల్వేతో అనుసంధానంపై కసరత్తు ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌ విద్యాధర్‌రావుతో బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కార్గో బిజినెస్‌ హెడ్‌ జీవన్‌ప్రసాద్‌లు భేటీ అయ్యారు. ఈ మేరకు రైల్వే ఆర్టీసీ సరుకు రవాణా అనుసంధానం సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.