ETV Bharat / state

ఇదేం అభిమానం - బిగ్​బాస్​ ఫ్యాన్స్​పై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఫైర్ - బిగ్​బాస్​ 7 తెలుగు

TSRTC MD Sajjanar Fires on Bigg Boss Fans : బిగ్​బాస్​ 7 ఫైనల్​ సందర్భంగా విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమరదీప్ అభిమానుల మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ బయట గొడవ జరిగింది. ఈ గొడవలో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ స్పందించారు. బస్సులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పీఎస్​లో కేసు నమోదైంది.

TSRTC MD Sajjanar
TSRTC MD Sajjanar Reacts on RTC Buses Damage
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 2:52 PM IST

TSRTC MD Sajjanar Fires on Bigg Boss Fans : తెలంగాణ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి అని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బిగ్​బాస్ అభిమానులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేసిన ఘటనపై స్పందించిన సజ్జనార్, ప్రజలను సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్లేనని ఎక్స్‌(ట్విటర్​) వేదికగా తెలిపారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని హితవు పలికారు.

  • ఇదేం అభిమానం!

    బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్‌ లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q

    — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Big Boss 7 Show Telugu : బిగ్ బాస్ 7(BIGG BOSS 7) ఫైనల్‌ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు వ్యక్తులు దాడి చేశారని ఎండీ సజ్జనార్(Sajjanar)​ తెలిపారు. ఈ సంఘటనలో ఆరు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఆర్టీసీ యాజమాన్యం ఫిర్యాదు చేసిందని, బాధ్యులపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వెల్లడించారు. ఆర్టీసీ ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Bigg Boss Telugu Season 7 Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్​కు 26 ఎకరాలు, లగ్జరీ కార్లు, కోట్ల విలువ చేసే ఆస్తులు.. క్లారిటీ ఇచ్చిన అతని తండ్రి.!

అసలేం జరిగిందంటే : జూబ్లీహిల్స్​లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బిగ్​బాస్​ విన్నర్, రన్నర్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. పల్లవి ప్రశాంత్​(రైతుబిడ్డ), అమర్​దీప్​(Pallavi Prasanth vs Amardeep) అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు అద్దాలను, పోలీస్​ వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

Bigg Boss 7 Telugu : బిగ్​బాస్​ 7 రన్నరప్​ అయిన అమర్​దీప్​ ఫ్యామిలీని విన్నర్​ పల్లవి ప్రశాంత్​ ఫ్యాన్స్​ తరిమికొట్టారు. అతని కారును ముందు నుంచి వెనుక నుంచి ధ్వంసం చేశారు. మాటామాటా పెరిగి ఈ గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవకు సంబంధించిన విజువల్స్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ ధ్వంసం కావడం పట్ల తాజాగా ఎండీ సజ్జనార్​ స్పందించారు.

"ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. హైదరాబాద్​ కృష్ణానగర్​ వద్ద 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. బిగ్ బాస్-7 ఫైనల్ విషయమై జరిగిన ఘర్షణలో బస్సులపై దాడులు జరిగాయి. ఈ సంఘటనపై జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదైంది. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచిది కాదు. ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్లే. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించదు. ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది." - సజ్జనార్​, ఆర్టీసీ ఎండీ

బిగ్‌బాస్‌ 7 విజేత 'రైతుబిడ్డ' కవిత అదుర్స్- రెమ్యునరేషన్‌+ ప్రైజ్‌మనీ ఎంతంటే?

'విన్నర్ నేనే, నాకు తెలుసు'- శివాజీ రెమ్యునరేషన్ అన్ని లక్షలా? ప్రశాంత్​ కంటే ఎక్కువ జాక్‌పాట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.