ETV Bharat / state

TSRTC Gamyam App : మీ బస్సు ఎక్కడుందోనని ఆగం కాకండి.. ఈ 'గమ్యం'తో చిటికెలో తెలుసుకోండి.. - Plug a bus

TSRTC Gamyam App : ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో తెలియక తికమక పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడొస్తుందో అన్న కంగారు అంతకన్నా అవసరం లేదు. ప్రయాణికుల సౌకర్యం కోసం టీఎస్‌ఆర్టీసీ ఓ సరికొత్త యాప్‌ (TSRTC Gamyam App)ను మన ముందుకు తెచ్చింది. బస్సుల రాకపోకల సమయాలు పక్కగా తెలుసుకునేలా 'గమ్యం' పేరుతో యాప్‌ను తీర్చిదిద్దింది. ఇంతకీ ఆ యాప్‌ ప్రత్యేకతలు ఏంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

TSRTC Launched Gamyam app
TSRTC Bus Tracking App
author img

By

Published : Aug 13, 2023, 8:41 AM IST

TSRTC Bus Tracking App ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ గమ్యం యాప్‌ ఆవిష్కరణ

TSRTC Gamyam App : ప్రజలకు రవాణా మరింత సౌకర్యంగా, అనుకూలంగా మార్చేందుకు టీఎస్​ఆర్టీసీ సరికొత్త బస్ ట్రాకింగ్ యాప్‌తో ముందుకు వచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో తీర్చిదిద్దిన బస్ ట్రాకింగ్ 'గమ్యం యాప్‌'ను (TSRTC Gamyam App) ఎంజీబీఎస్​ బస్టాండ్‌లో (MG Bus Stop) టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రారంభించారు. ప్రస్తుతం 4170 టీఎస్ఆర్టీసీ బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పుష్పక్ ఎయిర్‌ పోర్ట్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.

TSRTC Bus Tracking App : వివిధ జిల్లాలో పల్లె వెలుగు బస్సులు మినహా అన్ని బస్సులకు ఈ యాప్​ సదుపాయం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గమ్యం యాప్ ద్వారా ఆరంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు ప్రయాణికులు ఏఏ బస్సులు.. ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డ్రైవర్, కండక్టర్ వివరాలు సైతం అందులో కనిపిస్తాయని సజ్జనార్‌ వెల్లడించారు. ఈ యాప్‌లో కేవలం బస్ ట్రాకింగ్ సదుపాయమే కాకుండా... మహిళల భద్రత కోసం "ప్లాగ్ ఏ బస్" అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

TSRTC Decide to Special Buses Srisailam : శ్రీశైలం భక్తులకు TSRTC స్పెషల్​ ప్యాకేజ్​

TSRTC Electric Buses : త్వరలోనే భాగ్యనగరం రోడ్లపై.. ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్

రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 'ప్లాగ్ ఏ బస్ ఫీచర్' బస్సుల్లో అందుబాటులో ఉంటుంది. మనకు కావాల్సిన వివరాలు యాప్​లో నమోదు చేయగానే.. స్మార్ట్ ఫోన్‌లో స్క్రీన్​పై ఆటోమేటిక్‌గా గ్రీన్ లైట్ కనిపిస్తుంది. ఆ లైట్‌ను డ్రైవర్ వైపునకు చూపిస్తే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. ఈ యాప్​ ద్వారా మహిళలు సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100, 108కి అనుసంధానమయ్యేలా ఈ యాప్‌ను డిజైన్​ చేశారు.

TSRTC Launched Gamyam app : టీఎస్​ఆర్టీసీ గమ్యం పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో (Google Play Store) అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtc.telangana.gov.in నుంచీ ఈ యాప్‌ను ఉచితంగా డౌన్​లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. గమ్యం యాప్‌ను ప్రజలందరూ తమ స్మార్ట్ ఫోన్​లలో డౌన్ లోడ్ చేసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకుంటే అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి అని ఆర్టీసి అధికారులు స్పష్టం చేశారు.

"గమ్యం యాప్ ద్వారా ఆరంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు ప్రయాణికులు ఏఏ బస్సులు.. ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డ్రైవర్, కండక్టర్ వివరాలు సైతం అందులో కనిపిస్తాయి. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేసి బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. దూర ప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారా సమీపంలోని బస్టాప్​లను తెలుసుకోవచ్చు. ఆ సమాచారంతో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు."- వీసీ సజ్జనార్, టీఎస్​ఆర్టీసీ ఎండీ

TSRTC merging bill passed in assembly : ఆర్టీసీ బిల్లుకు ఉభయ సభల ఆమోదం... వారంతా ఇక సర్కారీ ఉద్యోగులే

Telangana Govt Explanation on RTC Bill : ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలోకి.. యథాతథంగా ఆర్టీసీ సంస్థ

Tiger photo exhibition on TSRTC : పులుల గొప్పతనం తెలిసేలా.. టీఎస్​ఆర్టీసీ ఏం చేసిందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.