ETV Bharat / state

TS RTC Call Center : మెరుగైన సేవల కల్పనే లక్ష్యంగా... హైటెక్​ తరహాలో ఆర్టీసీ కాల్​ సెంటర్​

TS RTC Call Center : ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఉన్న కాల్ సెంటర్‌లో అనేక మార్పులు, చేర్పులు చేసింది. హైటెక్ తరహాలో కాల్ సెంటర్​ను అభివృద్ది చేస్తున్నారు. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు కాల్​సెంటర్​ను ఆర్టీసీ వేదికగా మార్చుకుంటోంది. అందులో భాగంగా ప్రయాణికులకు అవసరమైన సేవలను... సత్వరమే అందించేవిధంగా కాల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు.

TS RTC Call Center
TS RTC Call Center
author img

By

Published : Feb 7, 2022, 10:21 AM IST

మెరుగైన సేవల కల్పనే లక్ష్యంగా... హైటెక్​ తరహాలో ఆర్టీసీ కాల్​ సెంటర్​

TS RTC Call Center : రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీ. 48వేల మంది ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు. సంక్రాంతి, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. పెళ్లిళ్లు, శుభాకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తుంది. మేడారం జాతర, అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. కార్గో, పార్శిల్ సర్వీసు సేవలు అందిస్తుంది. వీటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు గత పదేళ్ల నుంచి ఆర్టీసీ కాల్ సెంటర్‌ను అందుబాటులో ఉంచింది. అయితే.. గతంలో కొన్నింటికి మాత్రమే కాల్ సెంటర్​ వేదికగా ఉండేది. కేవలం బస్సుల వివరాలు మాత్రమే అందించేది. అప్పుడు పొరుగు సేవల వారికి కాల్ సెంటర్‌ను అప్పగించారు.

కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ...

ప్రస్తుతం ఆర్టీసీలో అదనంగా ఉన్నటువంటి కండక్టర్ల సేవలను.. ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకుంటోంది. ఉన్నత చదువులు చదివిన కండక్టర్లను.. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషపై పట్టు ఉన్న వారిని ఎంపిక చేసింది. వారికి ప్రత్యేక శిక్షణను అందించింది. ముందుగా 24 మందిని ఎంపిక చేసి.. వారితో కాల్ సెంటర్‌ను నడిపిస్తోంది. మరో 24 మందిని కూడా ఎంపిక చేశారు. ప్రస్తుతం వారు శిక్షణలో ఉన్నారు. వారి శిక్షణ పూర్తయితే.. మొత్తం 48 మందితో కాల్ సెంటర్‌ను పూర్తి స్థాయిలో నడిపించాలని ఆర్టీసీ ఆలోచన చేస్తుంది.

అవగాహన ఉన్నవారు కావడంతో..

కాల్ సెంటర్‌కు 040 30102829, 040 68153333 రెండు ప్రత్యేక నంబర్లను కేటాయించారు. ఈ నంబర్లు 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి. గతంలో పొరుగు సేవల సిబ్బంది ఉన్నప్పుడు.. బస్సుల రూట్‌లపై సరైన అవగాహన లేకపోవడంతో.. కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం కండక్టర్లే ఆ విధులు చేయడంతో.. వారికి అన్ని రూట్లపై అవగాహన ఉండడంతో ఇప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా నిర్వహిస్తున్నారు.

'బస్​పాస్​లు, మేడారం జాతరకు సంబంధించి ఎక్కువ కాల్స్​ వస్తున్నాయి. మహిళలకు ఉదయం 7నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విధులు కేటాయిస్తారు. ఈ మధ్యకాలంలో పార్శిల్​ సర్వీసుకు సంబంధించి ఎక్కువ కాల్స్​ వస్తున్నాయి.' -మంజుల, ఆర్టీసీ కండక్టర్

'కాల్​ సెంటర్​ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది కాబట్టి నిత్యం సుమారు 2వేల కాల్స్​ వరకు వస్తుంటాయి. పాఠశాలలు ప్రారంభమైనప్పటినుంచి విద్యార్థుల నుంచి బస్​పాస్ సంబంధిత వివరాల కోసం ఎక్కువ కాల్స్​ వస్తున్నాయి.' -మమత, ఆర్టీసీ కండక్టర్

సంస్థనే స్వయంగా కాల్‌ సెంటర్‌ నిర్వహించడం ద్వారా... ఆర్టీసీ సేవలు మరింత మంది ప్రజలకు చేరువవుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి : Medaram Arrangements : వనదేవతల జాతరకు పటిష్ఠ ఏర్పాట్లు : సత్యవతి రాఠోడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.