SIT Investigation in TSPSC Paper Leakage : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన... టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతుంది. తాజాగా సిట్ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఈనెల 24న అరెస్ట్ అయిన రవికిశోర్ బ్యాంకు ఖాతా, ఫోన్ కాల్ డేటాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అతని అనుమాన్పద లావాదేవీలను ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే రవికిశోర్ నుంచి సతీష్ కుమార్ అనే వ్యక్తి ఏఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇందులో రవికిశోర్ రూ.3 లక్షలు ఇచ్చినట్లు తేల్చారు. ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 43కి చేరింది. అరెస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
TSPSC Paper Leakage : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్‌ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శనివారం ఒకరు అరెస్ట్ కావడంతో.. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 43కి చేరినట్లు సిట్ తెలిపింది. సిట్ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం, ఫోరెన్సిక్ ఆధారాలతో.. ఈకేసుతో సంబంధం ఉన్న నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. మార్చి 11న నమోదైన అరెస్ట్‌ల పరంపర.. ఇప్పటికీ సాగుతూనే ఉంటుంది.
TSPSC Paper Leakage Issue Latest Update : ఈ ఏడాది మార్చి నెలలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకైనట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసుతో సంబంధం ఉన్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారి ద్వారా సమాచారం రాబట్టే అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రోజుల తరబడి ప్రశ్నించి.. వారి వద్ద నుంచి వివరాలను రాబట్టారు.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సిట్‌కు కేసును బదిలీ చేసింది. దాంతో సిట్ అధికారులు దర్యాప్తును వేగం చేయడంతో మరో 12 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి వద్ద ఉన్న 7 ప్రశ్నపత్రాల్లో ఢాక్యానాయక్ దంపతులుకు అసిస్టెంట్ ఇంజినీర్ పేపర్ అమ్మారు. వారివురు పరీక్ష రాసినట్లు నిందితుల కస్టడీలో తేలింది.
లక్షల్లో చేతులు మారిన నగదు : ఢాక్యానాయక్ ఉపాధి హామీ పథకంలో పని చేస్తూ.. తిరుపతయ్య అనే దళారి ద్వారా మరో 10 మందికి ఏఈ పేపర్ విక్రయించి ఆ వచ్చిన డబ్బును తీసుకున్నాడు. ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ గ్రూప్ 1 ప్రిలిమినరీ, ఏఈ, ఏఈఈ, డీఏవో ప్రశ్నపత్రాలను పాత వ్యక్తులకు గుట్టుగా విక్రయించి.. లక్షలను గడించాడు. ఇతని వద్ద నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, హైదరాబాద్‌కు చెందిన మురళీధర్‌రెడ్డి మరికొందరికి విక్రయించి లక్షలు గడించారు. ప్రధాన నిందితుల నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన మరికొందరు వారి నుంచి ఇంకొందరి వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నారు. అలా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ.. ఇప్పటికీ 43 మందిని అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి :