ETV Bharat / state

అసిస్టెంట్​ ఎగ్జిక్యూటీవ్​ ఇంజినీర్​ పరీక్ష తేదీని ప్రకటించిన TSPSC.. ఎప్పుడంటే? - TSPSC Paper Leak Case Latest Updates

Assistant Executive Engineer Recruitment Exam: టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన తరువాత రద్దయిన అసిస్టెంట్​ ఎగ్జిక్యూటీవ్​ ఇంజినీర్​ నియామక పరీక్షల కొత్త తేదీలను కమిషన్​ ప్రకటించింది. ఆ తేదీలు ఇప్పుడు చూద్దాం..

tspsc
tspsc
author img

By

Published : Mar 29, 2023, 9:06 PM IST

Updated : Mar 29, 2023, 10:32 PM IST

Assistant Executive Engineer Recruitment Exam: టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీతో రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నియామక పరీక్షల కొత్త తేదీలను పబ్లిక్​ సర్విస్​ కమిషన్​ ప్రకటించింది. మే 8వ తేదీన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్.. మే 9వ తేదీన అగ్రికల్చర్, మెకానికల్ అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు మే 21న ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్​పీస్సీ పేర్కొంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష వారం ముందు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్​ తెలిపింది.

TSPSC Exam Time Table: పేపర్​ లీకేజీ ఘటన తరువాత పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి మరికొన్ని పరీక్షలను వాయిదా టీఎస్​పీఎస్సీ.. మంగళవారం హార్టికల్చర్​ ఆఫీసర్​ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ నెల ఏప్రిల్ 4న జరగాల్సిన ఈ పరీక్షను.. జూన్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సిట్​ అధికారుల సూచనలు, కొన్ని పేపర్లు నిందితులు లీక్​ చేసారనే అనుమానంతో టీఎస్​పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా ఈ నెలలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల పరీక్షలను కూడా కమిషన్​ వాయిదా వేసింది. గ్రూప్‌-4, 2 పరీక్షల తేదీలను ప్రకటించిన కమిషన్​ వీటిని అనుకున్న సమయానికే నిర్వహించాలా? అనే విషయమై కమిషన్ ఆలోచిస్తోంది. తొలుత గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి.. జులై 1వ తేదీన గ్రూప్‌-4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

గ్రూప్-​1 ప్రశ్నాపత్రం ఐదుగురికి..: ఈ కేసులో నిందితులను విచారిస్తోన్న సిట్​ అధికారుల బృందం ఈ క్రమంలో గ్రూప్​1 పరీక్షల రాసిన అభ్యర్థులను సైతం విచారించింది. మొత్తం 84 మంది అభ్యర్థులను విచారించిన సిట్​.. ప్రిలిమినరి ప్రశ్నాపత్రం ఐదుగురికే చేరినట్టు ఆధారాలు సేకరించింది. ఏఈ ప్రశ్నాపత్రం మాత్రం 12 మందికి చేరినట్లు విచారణలో తేల్చింది. మరోవైపు చంచల్‌గూడ జైళ్లో ఉన్న ముగ్గురు నిందితులు షమీమ్, రమేశ్ , సురేశ్‌ను న్యాయస్థానం అనుమతితో ఐదు రోజుల కస్టడీకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

హార్టికల్చర్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటన

TSPSC పేపర్ లీకేజీ కేసు.. నిందితుల ద్వారా ఇంకెవరికైనా ప్రశ్నాపత్రం వెళ్లిందా..!

రేవంత్​రెడ్డి, బండి సంజయ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం.. లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

Last Updated : Mar 29, 2023, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.