TSPSC Group 4 General Rank Merit List After Dussehra : గ్రూప్-4 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ తీపి కబురు చెప్పనుంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 సర్వీసుల పోస్టుల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా(Group 4 Exam General Rank Cards)ను విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇప్పటికే నిర్వహించిన పరీక్షకు సంబంధించి తుది కీని వెల్లడించిన కమిషన్.. అందులో పేపర్-1లో ఏడు ప్రశ్నలు, పేపర్-2లో మూడు ప్రశ్నలు మొత్తం 10 ప్రశ్నలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా.. ఇందులో ఐదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.
టీఎస్‌పీఎస్సీ(TSPSC Group 4 Exam) జులై 1వ తేదీన నిర్వహించిన రాత పరీక్షను.. రాష్ట్రవ్యాప్తంగా 7.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన తుది కీ కూడా విడుదలైంది. అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం సైతం కమిషన్ పూర్తి చేసింది. ఇప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకుండా జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది.
Telangana Group 4 Final Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 తుది కీ విడుదల
TSPSC Group 4 Exam in Telangana : ఈ జాబితాలో పరీక్ష రాసిన అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు, కేటగిరీ, జిల్లా స్థానికత వంటి తదితర వివరాలను పొందుపరచనున్నారు. ఇందుకు దసరా పండగ(Dussehra Festival in 2023) తర్వాత మెరిట్ జాబితాను ఇవ్వాలని కమిషన్ భావిస్తోంది. ఇంతలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత నిచ్చాక.. ఎన్నికల కోడ్ అనంతరం 1:2 నిష్పత్తిలో తుది ఎంపిక జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూప్-4 అభ్యర్థులు తుది జాబితా గురించి నిరీక్షిస్తున్నారు.
గ్రూప్-4 పరీక్ష రాసిన 7.60 లక్షల మంది అభ్యర్థులు : రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న గ్రూప్-4 ఖాళీలను భర్తీ చేయడానికి గతేడాది డిసెంబరులో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ వంటి తదితర పోస్టులు ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ 8,180 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ ఏడాది జులై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను రికార్డు స్థాయిలో 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 7 లక్షల 60 వేల మంది అభ్యర్థులు పరీక్షను రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన తుది కీని టీఎస్‌పీఎస్సీ అక్టోబరులో ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎన్నికల కోడ్‌తో నవంబరులో జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష.. జనవరి నెలకు వాయిదా పడింది.
TSPSC Aspirants Confusion : గ్రూప్-1 చదవాలా.. గ్రూప్-2కు ప్రిపేర్ అవ్వాలా.. అయోమయంలో అభ్యర్థులు