TSPSC Group 3 Application Edit Option : టీఎస్‌పీఎస్సీ (TSPSC) నిర్వహించే తెలంగాణ గ్రూప్-3 పరీక్ష దరఖాస్తుల్లో సవరణలకు కమిషన్ అవకాశం కల్పించింది. ఈ నెల 16వ తేదీ ఉదయం 10గంల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 వరకు దరఖాస్తులను సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. తెలంగాణలో గ్రూప్-3 సర్వీసు(Group III services) ఉద్యోగాలకు గత డిసెంబర్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్3 సిలబస్ విడుదల..
Telangana Group 3 Notification : గ్రూప్ 3 నోటిఫికేషన్‌కు సంబంధించి.. మొత్తం 26 ప్రభుత్వ విభాగాల్లో 1,363 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో అప్లే చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తొలి గ్రూప్-3 నోటిఫికేషన్ కావడంతో అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. మొత్తం 5లక్షల 36వేల 477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. గ్రూప్ 3 పరీక్ష మూడు పేపర్లు ఉండగా.. మొత్తం 450 మార్కులు కేటాయించారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో పరీక్ష ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి అత్యధికంగా ఆర్థికశాఖలో 712 పోస్టులు ఉన్నాయి.
TSPSC Group 1 Results 2023 : ఫలితాలను వెల్లడించేలా టీఎస్‌పీఎస్సీ కసరత్తు.. ప్రత్యేక ప్రణాళిక షురూ
Telangana Group 2 Exams Reschedule : అభ్యర్థుల ఆందోళనలు, విజ్ఞప్తుల మేరకు ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్- 2 (Telangana Group 2 Exam) పరీక్షలను రీ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఈనెల చివరి వరకు గురుకుల పరీక్షలు ఉండటంతో కొందరు అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాలేమని ఆందోళన చేయగా.. వీరికి కొన్ని రాజకీయ పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి.
దీంతో వారి అభ్యర్థన మేరకు నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Telangana Group 1 Final Key : మరోవైపు తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి తుది కీను టీఎస్‌పీఎస్సీ ఈనెల మొదటి వారంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 28వ తేదీన ప్రాథమిక పరీక్ష నిర్వహించగా.. ప్రాథమిక కీను మొదట కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది కీను విడుదల చేసింది.
Telangana Group1 Prelims Final Key : గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీ విడుదల
TSPSC Paper Leak Arrests : పేపర్ లీకేజ్ కేసులో మరో 19 మంది అరెస్టు.. 74కు చేరిన సంఖ్య
Health Assistant Posts Notification : 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్