ETV Bharat / state

Telangana Group 1 Preliminary Exam : నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్.. పరీక్ష రాసే అభ్యర్థులకు సూచనలివే - తెలంగాణ గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్ష

Group 1 Prelims Exam In Telangana : ఇవాళ జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. గతంలో తలెత్తిన గందరగోళ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు షూ వేసుకోవద్దని.. చెప్పులతోనే రావాలని స్పష్టం చేసింది. బబ్లింగ్ పొరపాట్లు చేయవద్దని.. వెబ్‌సైట్‌లోని నమూనా ఓఎంఆర్ షీటుపై ప్రాక్టీసు చేయాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. ఇంకా టీఎస్‌పీఎస్సీ సూచించిన సూచనలను ఒకసారి చూద్దాం.

TSPSC
TSPSC
author img

By

Published : Jun 10, 2023, 7:18 PM IST

Updated : Jun 11, 2023, 6:32 AM IST

Group 1 Prelims Exam Arrangements : గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబరు 16న జరిగిన గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు కావడంతో.. ఇవాళ మళ్లీ నిర్వహిస్తున్నారు. పరీక్ష వాయిదా వేయలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో.. ఈరోజు పరీక్ష యథాతథంగా జరగనుంది. రాష్ట్రంలో 503 పోస్టులకు నిర్వహిస్తున్న గ్రూప్ - 1కు 3,80,072 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.

గతంలో జరిగిన లోటుపాట్లు, గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు, పరీక్ష నిర్వహణ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి వేర్వేరుగా అధికారులతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

పరీక్ష రాసే అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అంశాలు :

  • ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది.
  • ఉదయం 8.30 నుంచి 10.15 నిమిషాల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి.
  • ఉదయం 10.15 తర్వాత గేట్లు మూసివేత.. ఆ తర్వాత పరీక్ష కేంద్రాల్లోని అనుమతి ఉండదు.
  • హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌, పాన్‌కార్డు, పాస్‌పోర్టు వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఐడీ చూపించాలి.
  • హాల్‌టికెట్‌పై ఫొటో లేకపోతే.. కచ్చితంగా గెజిటెడ్‌ అధికారి సంతకం.. మూడు ఫొటోలు ఉండాలి.
  • వాచీలు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులు, మొబైల్‌ఫోన్‌ వంటి వాటికి అనుమతి లేదు.
  • అభ్యర్థులు చెప్పులు వేసుకొని మాత్రమే రావాలి. షూ ధరించరాదు.
  • ఓఎంఆర్‌ షీట్‌పై బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్ను మాత్రమే ఉపయోగించాలి.
  • పెన్సిల్‌, జెల్‌, ఇంకు పెన్ను వాడితే జవాబు పత్రాన్ని ఆప్టికల్‌ మార్క్ స్కానర్‌ సిస్టం గుర్తించదు.
  • ఓఎంఆర్‌ షీట్‌పై వ్యక్తిగత వివరాలు బబ్లింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
  • వైట్‌నర్‌, చాక్‌ పౌడర్‌, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌లో మార్పులు చేస్తే ఓఎంఆర్‌ షీట్‌ మూల్యాంకనం చేయరు.
  • ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసినా.. ఎలాంటి అవకతవకలకు పాల్పడిన క్రిమినల్‌ కేసు ఉంటుంది.
  • మాస్‌ కాఫీయింగ్‌కు పాల్పడిన వారు భవిష్యత్తులో ఉద్యోగ నియామక పరీక్షలు రాయకుండా డీబార్‌ చేస్తారు.

TSPSC Group 1 Exam : గతంలో జరిగిన పరీక్షలో బబ్లింగ్ పొరపాట్లు వల్ల వందల మంది అనర్హులయ్యారు. ఈసారి ఆ పొరపాట్లను చేయవద్దని కమిషన్‌ సూచించింది. అభ్యర్థులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. మహిళ అభ్యర్థుల తనిఖీల కోసం మహిళ కానిస్టేబుళ్లు, ఏఎన్‌ఎంలు, ఇతర విభాగాల సిబ్బందిని వినియోగించాలని సీఎస్ శాంతికుమారి అధికారులకు తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 11, 2023, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.