TSPSC UPDATE NEWS: ఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కమిషన్ ఛైర్మన్‌కు నోటీసులిస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదింపుతూ.. సిట్ అధికారులే కమిషన్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం మూడున్నర సమయంలో సిట్ అధిపతి ఏఆర్ శ్రీనివాస్ తన బృందంతో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు. ఛైర్మన్ ఛాంబర్‌లో సాయంత్రం 6.30 నుంచి 7 వరకు ఉన్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు జనార్దన్‌రెడ్డి నుంచి వారు పలు కీలక వివరాలు సేకరించినట్లు సమాచారం. ప్రశ్నపత్రాలలీకేజీ కేసులో ఇప్పటికే కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని సిట్ అధికారులు విచారించారు.
కమిషన్ ఛైర్మన్‌పై ప్రశ్నల వర్షం: నియామక ప్రక్రియ ఎలాఉంటుంది? టీఎస్పీఎస్సీలో ఏ విభాగాలు ఏయే పనులు నిర్వహిస్తాయి? ఎవరు ఏయే బాధ్యతలు చూస్తారో జనార్దన్‌రెడ్డిని సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. నియామక ప్రక్రియలో ఓటీఆర్, నోటిఫికేషన్, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షా కేంద్రాల కేటాయింపు, ప్రశ్నపత్రాల తరలింపు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, అర్హుల జాబితా రూపకల్పన, తుది ఫలితాల వెల్లడి.. వివిధ దశల్లో కమిషన్ వ్యవహరించే తీరుపై అడిగారు. ప్రశ్నపత్రాలను ఎలా రూపొందిస్తారు? ఎలా భద్రపరుస్తారనే అంశాలపై ఆరా తీశారని సమాచారం. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌కి కస్టోడియన్ ఎవరుంటారు? బాధ్యత ఎవరిది? ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక నిర్వహణ లోపాలున్నాయా? గత అక్టోబరు నుంచే ప్రశ్నపత్రాలను కాజేసేందుకు ఉద్యోగులు చేస్తున్న యత్నాలను కమిషన్ పరిపాలన యంత్రాంగం ఎందుకు గుర్తించలేదు?. ప్రశ్నపత్రాలు భద్రపరిచేందుకు ఉపయోగించే కంప్యూటర్ వ్యవస్థ బలహీనతను గుర్తిస్తే ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారనే అంశంపై వివరాలు సేకరించారు. కమిషన్‌లో ఇతర సేవల ఉద్యోగుల నియామకాల తీరుపై అడిగి తెలుసుకున్నారు.
నిందితులను 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మొదలుపెట్టింది. న్యాయస్థానం నుంచి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని అధికారులు తీసుకున్నారు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు- ఈసీఐఆర్ నమోదుచేశారు. మరికొద్ది రోజుల్లో సిట్ అధికారులను సంప్రదించి వివరాలు సేకరించనున్నారు. వాటి ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించే అవకాశముంది. ఆ కేసులో అరెస్టయిన ప్రశాంత్‌రెడ్డి, రాజేందర్‌కుమార్, తిరుపతయ్యను 5రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. చర్లపల్లి జైలులోని నిందితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలో మధ్యవర్తిగా వ్యవహరించిన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం ఉపాధిహామీ సాంకేతిక సహాయకుడు తిరుపతయ్యను సస్పెండ్‌చేస్తూ డీఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చదవండి: