ETV Bharat / state

TSLPRB Focus On Police Candidates Training : అక్టోబర్​లో కానిస్టేబుళ్లకు శిక్షణ! 28 కేంద్రాల్లో ఏర్పాట్లు

TSLPRB Focus On Police Candidates Training : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాల్లో తుది అంకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కి రావడంతో వారి శిక్షణపై పోలీసు శాఖ దృష్టి సారించింది. కొత్తగా ఎంపికయ్యే 554 మంది ఎస్సై, 9,871 మంది కానిస్టేబుళ్లకు రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Police Candidates Training October
TSLPRB Focus On Police Candidates Training
author img

By

Published : Aug 13, 2023, 12:55 PM IST

TSLPRB Focus On Police Candidates Training : రాష్ట్రంలో పోలీసు అభ్యర్థులకు పోలీస్‌ నియామక మండలి శుభవార్త చెప్పనుంది. ఇప్పటికే ఎస్సైల ఎంపిక జాబితాను ప్రకటించిన మండలి.. కానిస్టేబుళ్ల ఎంపిక జాబితాను కూడా ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటి వారంలో ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల 554 మంది కొత్త ఎస్సైలను ఎంపిక చేయగా.. ఇంకా 9,871 మంది కానిస్టేబుళ్లకు అక్టోబరు నుంచి శిక్షణ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లలో పోలీస్‌ శాఖ నిమగ్నమైంది.

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ(TSLPRB) ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాలలో ఎంపికైన వారికి రాష్ట్రవ్యాప్తంగా 28 శిక్షణా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు నియామక మండలి అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఈ ఏర్పాట్లలో భాగంగా శిక్షణా ప్రాంతాల్లో ఉన్న మైదానాలు చదును చేయడం, వారికి వసతి కల్పించడం వంటి అనేక పనులను చేపట్టింది. ఈ శిక్షణార్థుల్లో దాదాపు 2,000 మంది మహిళల కోసం ప్రత్యేకంగా 3 కేంద్రాలను కేటాయించారు.

Police Candidates Training October : కానిస్టేబుళ్ల ఎంపిక జాబితాను ప్రకటించిన తర్వాత.. 20 రోజుల పాటు వారిపై స్పెషల్‌ బ్రాంచ్‌ విచారణ చేయనుంది. అనంతరం ఎలాంటి సమస్యలు లేనివారి పేర్లను తుది జాబితాలో చేర్చనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సవ్యంగా సాగితే అక్టోబరు ఒకటి నుంచే కానిస్టేబుళ్ల శిక్షణను ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వీరికి శిక్షణ విభాగం నేతృత్వంలో, ఎస్సైలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ(TSPA) ఆధ్వర్యంలో 9 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

SSC Jobs : ఎస్​ఎస్​సీ భారీ నోటిఫికేషన్​.. డిగ్రీ అర్హతతో 1876 ఎస్​ఐ​ పోస్టుల భర్తీ!

Telangana Police Training For 9 Months : మరోవైపు సరిపడా మైదానాలు లేకపోవడంతో ఈసారి కూడా టీఎస్‌ఎస్‌పీ శిక్షణను రెండో విడతలోనే నిర్వహించనున్నారు. ఈసారి మొత్తం 17,156 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించగా.. జైళ్లు, ఫైర్‌ తదితర విభాగాల పోస్టులు పోనూ 14,881 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేయనున్నారు. వీరిలో టీఎస్‌ఎస్‌పీ 5,010, సివిల్‌ 4,965, ఏఆర్‌ 4,523, పీటీవో 121, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో 262 కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే వీరిలో 12 వేల మందికి సరిపడా శిక్షణా మైదానాలు మాత్రమే ఉన్నాయి. అయితే 2018 నోటిఫికేషన్‌లో ఎంపికైన 16 వేల మంది శిక్షణకు మైదానాలు సరిపోకపోవడంతో 9 నెలలు శిక్షణను టీఎస్‌ఎస్‌పీ వాయిదా వేసింది.

జీవో 46ను రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం : పోలీస్ అశావహులు

సివిల్‌ కానిస్టేబుళ్లకు శిక్షణ ఎక్కడ : సైబరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్‌ సీటీసీ(నగర శిక్షణ కేంద్రం)ల్లో 250 మందికి చొప్పున, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ డీటీసీ(జిల్లా శిక్షణ కేంద్రం)ల్లో 250 మందికి, అంబర్‌పేట పీటీసీలో 650, కరీంనగర్‌ పీటీసీలో 912 మందికి చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు.

మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక కేంద్రాలు : మహిళా కానిస్టేబుళ్లకు ఈసారి మూడు ప్రత్యేక కేంద్రాల్ని పోలీస్‌ శాఖ కేటాయించింది. గతంలో వీరందరికీ టీఎస్‌పీఏలోనే శిక్షణ ఇవ్వగా.. ఈసారి దీంతో పాటు మరో రెండు కేంద్రాలను ఎంపిక చేశారు. వరంగల్‌ పీటీసీలో 1000 మంది సివిల్‌, మేడ్చల్‌ పీటీసీలో 442 ఏఆర్‌, టీఎస్‌పీఏలో 653 మంది సివిల్‌ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

Telangana Police SI 2023 : త్వరలోనే ఎస్సై, కానిస్టేబుళ్ల తుది ఎంపికల జాబితా వెల్లడి!

SSC Jobs 2023 : ఇంటర్​ అర్హతతో.. ఎస్​ఎస్​సీలో 1207 స్టెనోగ్రాఫర్​ ఉద్యోగాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.