Mistakes in Part-2 Applications: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ)లను రాష్ట్రవ్యాప్తంగా 11-12 కేంద్రాల్లో నిర్వహించనుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు అదనంగా ఒకట్రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనేది మాత్రం ప్రకటించలేదు. పీఈటీ/పీఎంటీ అడ్మిట్‌కార్డులను వెబ్‌సైట్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు అభ్యర్థులు తమవెంట అడ్మిట్‌కార్డుతో పాటు తీసుకురావాల్సిన సర్టిఫికేట్ల గురించి మండలి స్పష్టత ఇచ్చింది.
2,37,862 మంది అభ్యర్థుల దరఖాస్తు: ప్రాథమిక రాతపరీక్ష(పీడబ్ల్యూటీ)లో ఉత్తీర్ణులైన 2,37,862 మంది అభ్యర్థులు గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 1,91,363 మంది పురుషులు, 46,499 మంది మహిళలున్నారు. మొత్తం 5,07,890 రావాల్సి ఉండగా.. గడువులోపు 4,63,970 నమోదయ్యాయి. మొత్తంగా 91శాతం దరఖాస్తులొచ్చాయి. ఆబ్కారీ కానిస్టేబుల్ పోస్టులకు అత్యధికంగా.. పోలీస్ రవాణా సంస్థ డ్రైవర్ పోస్టులకు అత్యల్పమంది నమోదు చేసుకున్నారు.
ఆందోళన వద్దు.. అవకాశమిస్తాం: పార్ట్-2 దరఖాస్తుల్లో తప్పిదాలు దొర్లాయంటూ పలువురు అభ్యర్థులు వినతులు ఇస్తున్నారని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పలు దరఖాస్తుల్లో తప్పులు దొర్లినట్లు ఇప్పటికే గుర్తించామని, అలాంటి వారికి ఎడిట్ ఆప్షన్ ద్వారా సవరణకు తగిన సమయంలో లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా అవకాశం ఇస్తామన్నారు. అభ్యర్థులు గందరగోళానికి గురికావొద్దని సూచించారు.
లక్ష్య ఛేదనకు ‘సాధన’
ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం ఉద్యోగార్థులతో కిక్కిరిసిపోతోంది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష రాసి ఉత్తీర్ణులైన యువతీ యువకులు శారీరక సామర్థ్య పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే గ్రూపులుగా విడిపోయి పరుగు, ఇతర వ్యాయామాలతో ఇలా నిత్యం చెమటోడుస్తున్నారు.
ఇవీ చదవండి: