ఈవీఎంలను మాయ చేసి అధికారం చేపట్టారు: టీపీసీసీ - 2019 TELANGANA ELECTIONS
" బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎన్నికల్లో తెరాస మద్దతు పలికిన ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు... తెలంగాణ మేధావులు, ఉద్యోగులు ప్రజల పక్షాన నిలిచారు... అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను మాయ చేయటం వల్లే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు " తెలంగాణ కాంగ్రెస్ నేతలు
ఈవీఎంలను మాయ చేసి అధికారం చేపట్టారు: టీపీసీసీ
శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలను మాయ చేసి కేసీఆర్ గెలిచారని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది. బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎన్నికల్లో తెరాస మద్దతు పలికిన ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ మేధావులు, ఉద్యోగులు ప్రజల పక్షాన నిలిచారని స్పష్టం చేశారు... ముందస్తు ఎన్నికల్లో తమ పార్టీకి 73 చోట్ల పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు అధికంగా రాగా... తెరాసకు కేవలం 28 చోట్ల మాత్రమే ఎక్కువ వచ్చాయన్నారు.