కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన అంతర్‌రాష్ట్ర సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ పునఃప్రారంభించింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సోమవారం ఉదయం నుంచి బస్సులను నడిపింది. బెంగళూరుకు మరికొన్ని రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అంతర్‌రాష్ట్ర ఒప్పందం కుదరకపోవటంతో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం బస్సు సర్వీసులను ఇంకా ప్రారంభించలేదు.
మూడు రాష్ట్రాలకు టీఎస్‌ఆర్టీసీ సాధారణ రోజుల్లో నిత్యం 300 బస్సులను నడిపేది. సోమవారం కర్ణాటకలోని రాయచూర్, బీదర్ తదితర ప్రాంతాలకు 80, మహారాష్ట్రలోని నాగ్‌పుర్ తదితర ప్రాంతాలకు 28, ఛత్తీస్‌గఢ్‌కు 20 సర్వీసులు నడిపింది. మూడు రాష్ట్రాలకు తొలిరోజు ప్రయాణికుల సంఖ్య 45 శాతం వరకు ఉంది. మరోవైపు కర్ణాటక ఆర్టీసీ తెలంగాణకు 28 బస్సులు నడిపింది.
ఇవీ చూడండి: ఆదుకోవాల్సిన యాజమాన్యమే.. వాడుకుంది!