బస్ బుక్ చేసుకోండి...బహమతులు అందుకోండి అంటోంది ఆర్టీసీ. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్టీసీ సంస్థ సద్వినియోగం చేసుకుంటుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో... పెళ్లి కోసం బస్సులు బుక్ చేసుకున్న వారి వివాహ వేడుకకు ఆర్టీసీ తరఫున ఒకరు వెళ్లి నూతన జంటను ఆశీర్వదించి...ఆర్టీసీ తరఫున బహుమతిని అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు (ts rtc wedding gift for who book a rtc bus for their marriage ceremonies) . ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (md sajjanar) సైతం ఓ వివాహ వేడుకకు హాజరై... కానుక ఇచ్చారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు
రాష్ట్రంలో ఆర్టీసీకి ఎల్లప్పడూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలకు మరింత చేరువ చేయటానికి అనేక సరికొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్నారు. దసరా పండుగ సందర్బంగా గతంలో ప్రత్యేక బస్సులు నడిపి... అందుకు అధిక ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ, ఈ ఏడాది సాధారణ ఛార్జీలు తీసుకుని ప్రయాణికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. దీంతో ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తంచేశారు. రానున్న సమ్మక్క-సారాలమ్మ జాతరకు సైతం సాధారణ చార్జీలను వసూలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ విధంగా ప్రయాణికులకు అనువైన నిర్ణయాలు తీసుకుంటూ మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదీ చూడండి: Sajjanar traveled in tsrtc bus: మరోసారి... ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్
రైతులకు అండగా..
రైతులకు కూడా ఆర్టీసీ అండగా నిలవాలని భావిస్తోంది. ఇప్పటికే కల్లాల వద్దకు కార్గో బస్సులను నడిపిస్తోంది. గత ఏడాది 5వేల టన్నుల ధాన్యాన్ని కల్లాల నుంచి ఆర్టీసీ కార్గో బస్సుల్లో తరలించారు. సుమారు 500ల ట్రిప్పుల ధాన్యాన్ని తరలించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
సత్ఫలితాలనిస్తోన్న కార్గో సేవలు
లాక్ డౌన్ సమయంలో మార్చి 24న కార్గో సేవల్ని ఆర్టీసీ (rtc cargo service) ప్రారంభించింది. సుమారు 9-10 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉన్న 150 కార్గో బస్సులు, 4 టన్నులు ఉన్న 28 మినీ కార్గో బస్సులు ఆర్టీసీలో అందుబాటులో ఉన్నాయి. 10 టన్నులు ఉన్న కార్గో బస్సులకు కల్లాల వద్ద నుంచి 50 కిలోమీటర్ల పరిధి వరకు రూ.5,130 అద్దె వసూలు చేస్తారు. 4టన్నుల కార్గో బస్సులకు 50కిలోమీటర్ల పరిధిలో రూ.4,260 వరకు వసూలు చేస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది. గత ఏడాది ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని ఆర్టీసీ వెల్లడించింది. ఈసారి కూడా రైతులు కార్గో బస్సులను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: rtc md sajjanar: 'ఆర్టీసీకి కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లు'