ETV Bharat / state

'కరోనా బారి నుంచి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలి' - covid second wave

కరోనా రెండో దశ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై.. హైదరాబాద్​లోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సదస్సు జరిగింది. ప్రభుత్వం.. కార్మికుల సంక్షేమంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

 rtc employees unions
rtc employees unions
author img

By

Published : May 3, 2021, 5:57 PM IST

కరోనా బారి నుంచి కార్మికులను రక్షించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్లు డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా.. 40 మందికి పైగా మహమ్మారి ధాటికి బలయ్యారని ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆయన సదస్సు నిర్వహించారు. సమస్యల సాధనకు.. బస్ భవన్ ముందు బైఠాయించి శాంతియుత నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు.

రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాజిరెడ్డి అన్నారు. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో స్పెషల్ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని కోరారు.

బాధితులకు 21 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్​ను మంజూరు చేయాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. డ్రైవర్, కండక్టర్​లకు.. ఎన్-95 మాస్కులు, శానిటైజర్​లు, హ్యాండ్ గ్లౌజులు, పీపీఈ కిట్ల లాంటి రక్షణ చర్యలను కల్పించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి: ప్రజా రవాణాపై కరోనా ప్రభావం.. వైరస్​కు బలవుతున్న ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.