లోపభూయిష్టమైన రెవెన్యూ చట్టాలు, సాప్ట్వేర్ల వల్ల ఇలా జరిగిందని స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఉన్న అధికారులకు రెవెన్యూ రికార్డులు సరిచేసే అధికారం లేదన్నారు. కొన్నింటిని సరిచేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ... ఆన్‌లైన్‌లో ఆ అవకాశానికి తావులేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతుండటం వల్ల రైతుల వద్ద బదనాం అవుతున్నామని చెప్పారు. భూపరిపాలన నుంచి రెవెన్యూశాఖను మినహాయించాలని కోరుతున్నట్లు ఐకాస నేతలు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు...
తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనంతో తెలంగాణ రెవెన్యూ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు రిలే నిరహార దీక్షలు చేస్తున్నారు. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద జరుగుతున్న దీక్షా శిబిరాలను జేఏసీ నాయకులు సందర్శించారు. వచ్చే సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.