ETV Bharat / state

బండి సంజయ్‌ పాదయాత్రను నిలిపేయాలని నోటీసులు జారీ

TS Police issued a notice to Bandi Sanjay to stop the Praja Sangrama Yatra

author img

By

Published : Aug 23, 2022, 3:55 PM IST

Updated : Aug 23, 2022, 4:52 PM IST

15:51 August 23

బండి సంజయ్‌ పాదయాత్రను నిలిపేయాలని నోటీసులు

TS Police issued a notice to Bandi Sanjay to stop the Praja Sangrama Yatra
బండి సంజయ్‌ పాదయాత్రను నిలిపేయాలని పోలీసులు నోటీసులు జారీ

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు జారీచేశారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లకు వర్దన్నపేట ఏసీపీ ఈ తాఖీదులు ఇచ్చారు.

జనగామ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని... ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు.

దీంతో తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం

Last Updated : Aug 23, 2022, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.