ETV Bharat / state

Arvind Kumar: 'రాజకీయంగా ఏమైనా ఉండొచ్చు.. మాపై ఆరోపణలు వద్దు' - పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్

Arvind Kumar Clarity on ORR Tender Issue: హైదరాబాద్‌ ఓఆర్​ఆర్​ టెండర్లు... హైవే అథారిటీ విధివిధానాల ప్రకారమే జరిగిందని తెలంగాణ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఓఆర్​ఆర్​ టెండర్‌ ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. రాజకీయంగా ఏమైనా ఉండొచ్చు, అధికారులపై ఆరోపణలు తగదన్న ఆయన... ఒప్పందం పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

Arvind Kumar
Arvind Kumar
author img

By

Published : May 3, 2023, 6:15 PM IST

Updated : May 3, 2023, 7:38 PM IST

రాజకీయంగా ఏమైనా ఉండొచ్చు, అధికారులపై ఆరోపణలు తగదు: అర్వింద్‌ కుమార్‌

Arvind Kumar Clarity on ORR Tender Issue: తెలంగాణలో రాజకీయ అలజడి రేపుతున్న ఓఆర్‌ఆర్‌ టెండర్‌ ఆరోపణలపై తాజాగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్​కుమార్ వివరణ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ టీఓటీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ విధివిధానాల ప్రకారమే వెళ్లినట్లు ఆయన తెలిపారు. టీఓటీ బేస్ ప్రైస్ పెట్టాము కానీ బయటకు చెప్పలేదన్న అర్వింద్​కుమార్... ఎన్‌హెచ్‌ఏఐ కూడా బేస్ ప్రైస్ చెప్పడం లేదని పేర్కొన్నారు. బిడ్డింగ్​లో బేస్ ప్రైస్ కంటే ఎక్కువగా వచ్చిందని అన్నారు. టోల్ నిబంధనలకు లోబడి మాత్రమే నడుచుకోవాల్సి ఉంటుందన్న ఆయన... అథారిటీ అనుమతి లేకుండా టోల్ చార్జీలు పెంచరాదని స్పష్టం చేశారు.

ఓఆర్‌ఆర్‌ బిడ్డింగ్ గడువు 142 రోజులు ఇచ్చాం: ప్రతి పదేళ్లకోమారు ఆదాయాన్ని సమీక్షిస్తామని.. ఆదాయం అంచనాకు ఎక్కువగా ఉంటే కాలపరిమితి తగ్గించాలని నిబంధనల్లో ఉందని అర్వింద్​కుమార్ తెలిపారు. బిడ్డింగ్ గడువు 142 రోజులు ఉందని.. ఆలోగా మొత్తం 7380 కోట్లు ఇవ్వకుండా ఓఆర్ఆర్​ను ఐఆర్​బీకి అప్పగించబోమని ఆయన స్పష్టం చేశారు. బిడ్ ఇంకా పెంచుతారా అని హెచ్‌-1ను అడిగే వెసులుబాటు ఎన్‌హెచ్‌ఏఐలో కూడా ఉందని, అలా అడిగితే రూ.7380 కోట్లకు పెంచారని వివరించారు. ఓఆర్​ఆర్ ప్రస్తుతం ఉన్న అన్ని సేవలు అందుతాయని.. ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. గ్రీనరీ నిర్వహణ మాత్రం హెచ్ఎండీఏనే చేపడుతుందని చెప్పారు. ట్రామా కేంద్రాల నిర్వహణ కూడా లీజు తీసుకున్న వారే చూడాలని పేర్కొన్నారు.

ఒప్పందం పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తాం: ఒప్పందం ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక అన్ని వివరాలు బయటకు వెల్లడిస్తామని అర్వింద్ కుమార్ తెలిపారు. రాజకీయంగా ఏమైనా ఉండవచ్చు కానీ, అధికారులపై ఆరోపణలు తగదన్న ఆయన... వ్యక్తిగతంగా తనపై ఆరోపణలు దురదృష్టకరమని అన్నారు. నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తిస్తున్నామని, తనపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని తెలిపారు. ఓఆర్ఆర్​పై మరో మూడు ఇంటర్ చేంజ్​లు ఏర్పాటు చేస్తామన్న ఆయన... హెచ్ఎండీఏ ఖర్చుతోనే వాటిని ఏర్పాటు చేస్తామని వివరించారు. ఓఆర్ఆర్ వెంట సైకిల్ ట్రాక్​ల నిర్వహణ కోసం కూడా బిడ్లు పిలుస్తామని చెప్పారు. హెచ్​జీసీఎల్ అవసరమా... లేదా... చూడాలని వ్యాఖ్యానించారు.

'హైదరాబాద్‌ ఓఆర్​ఆర్​ టెండర్లు...హైవే అథారిటి విధివిధానాల ప్రకారమే జరిగింది. హైవే అథారిటీ అనుమతి లేకుండా టోల్ ఛార్జీలు పెంచరు. లీజుకు బేస్ ప్రైస్ నిర్ధారించాం.. కానీ బయటకు చెప్పలేదు. ఎన్‌హెచ్‌ఏఐ కూడా బేస్ ప్రైస్ వెల్లడించట్లేదు. ఓఆర్‌ఆర్‌ బిడ్డింగ్‌లో బేస్ ప్రైస్ కంటే ఎక్కువ వచ్చింది. ఓఆర్‌ఆర్‌ బిడ్డింగ్ గడువు 142 రోజులు ఇచ్చాం. నిబంధనల ప్రకారం అడిగితేనే రూ.7,380 కోట్లకు పెంచారు. రాజకీయంగా ఏమైనా ఉండొచ్చు, అధికారులపై ఆరోపణలు తగదు.' -అర్వింద్‌ కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి:

Last Updated : May 3, 2023, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.