ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆటోనగర్ సమీపంలో సుమారు 10 ఎకరాల భూమిని ఇసుక లారీల పార్కింగ్ కోసం కేటాయిస్తామని తెలిపారని తెలంగాణ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రెడ్డి పేర్కొన్నారు. లారీ యజమానులకు, డ్రైవర్లకు అన్ని సదుపాయాలు కల్పించడం కోసం సుమారు రూ. 8 కోట్ల వ్యయంతో ట్రక్ పార్కింగ్ షెడ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, వాహనాల వాషింగ్ సెంటర్, రెస్టారెంట్స్ ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.6.62 కోట్లు విలువైన బంగారం స్వాధీనం