ETV Bharat / state

దివ్యాంగులు ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేసుకోండి: కొప్పుల ఈశ్వర్ - Government good news for the disabled

ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే ఉపకరణాల కోసం దివ్యాంగులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్​ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 13వేల 195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు వివరించారు.

దివ్యాంగులు ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేసుకోండి: కొప్పుల ఈశ్వర్

author img

By

Published : Jan 22, 2021, 7:43 PM IST

Updated : Jan 22, 2021, 9:00 PM IST

దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే ఉపకరణాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్​ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ దివ్యాంగులకు వివిధ రకాలైన 13వేల 195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు వివరించారు.

20కోట్ల 41 లక్షల రూపాయల వ్యయంతో త్రిచక్రవాహనాలు, వీల్​ఛైర్స్​, లాప్​టాప్స్​, 4జీ స్మార్ట్​ ఫోన్స్​, వినికిడి యంత్రాలు చేతికర్రలు, ఎంపీ3 ప్లేయర్స్​ పంపిణీ చేయనున్నట్లు కొప్పుల తెలిపారు. 90వేల రూపాయల విలువ చేసే.. 900 రిట్రోఫెట్టెడ్​ మోటారు వాహనాలు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఉపకరణాల కోసం దివ్యాంగులు ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి వివరించారు.

www.obmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న.. అర్హతగల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 15 నుంచి ఉపకరణాల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Last Updated : Jan 22, 2021, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.