ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు.. తుది నోటిఫికేషన్ జారీ - తెలంగాణలో కొత్త మండలాలు

TS government has issued a final notification establishing 13 new mandals in Telangana
రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు.. తుది నోటిఫికేషన్ జారీ
author img

By

Published : Sep 26, 2022, 9:15 PM IST

Updated : Sep 26, 2022, 9:52 PM IST

21:10 September 26

కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జులై 23న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జులైలో ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది.

కొత్తగా ఏర్పడనున్న మండలాల వివరాలు ఇలా..

  1. జగిత్యాల జిల్లాలో కొత్త మండలాలు: ఎండపల్లి, భీమారం
  2. సంగారెడ్డి జిల్లాలో కొత్త మండలం: నిజాంపేట్
  3. నల్గొండ జిల్లాలో కొత్త మండలం: గట్టుప్పల్
  4. మహబూబాబాద్ జిల్లాలో కొత్త మండలాలు: సీరోలు, ఇనుగుర్తి
  5. సిద్దిపేట జిల్లాలో కొత్త మండలాలు: అక్బర్‌పేట, భూంపల్లి, కుకునూరుపల్లి
  6. కామారెడ్డి జిల్లాలో కొత్త మండలం: డోంగ్లి
  7. మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త మండలం: కౌకుంట్ల
  8. నిజామాబాద్‌ జిల్లాలో కొత్త మండలాలు: ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా

Last Updated : Sep 26, 2022, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.