ETV Bharat / state

రూల్ కర్వ్స్ అంశంపై కేఆర్ఎంబీకి ప్రభుత్వం మరోమారు లేఖ

author img

By

Published : Sep 12, 2022, 5:26 PM IST

రూల్ కర్వ్స్ అంశంపై కేఆర్ఎంబీకి ప్రభుత్వం మరోమారు లేఖ రాసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కోరిన సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. రూల్ కర్వ్స్ సంబంధిత ముసాయిదాలో రాష్ట్ర అభిప్రాయాలు పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు.

TS Government again letter to KRMB on the issue of rule curves
రూల్ కర్వ్స్ అంశంపై కేఆర్ఎంబీకి ప్రభుత్వం మరో లేఖ

శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల రూల్ కర్వ్స్ రూపకల్పనకు సంబంధించి తమ అభిప్రాయాలను కూడా ముసాయిదాలో పొందుపర్చాలని, అందుకు అనుగుణంగా సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డును మరోసారి కోరింది. ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి తాము అడిగిన అనుమతుల వివరాలు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్... కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తాజాగా మరో లేఖ రాశారు.

శ్రీశైలం జలాశయం సహా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తదితర ఏపీలోని ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తాము కోరామని... ప్రత్యేకించి 1981 మార్చ్ 28న జరిగిన 16వ టీఏసీ సమావేశం ముందు ఉంచిన నోట్ కావాలని కోరినట్లు లేఖలో గుర్తు చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.