TS Election Campaign in Full Josh : శాసనసభ ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీల ప్రచారాలు జోరు జోరుగా హోరెత్తుతున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొత్తపేట మారుతీనగర్‌లో.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్.. పాదయాత్ర చేస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సతీమణి విజయలక్ష్మి.. జనప్రియ మహానగర్‌లో ఇంటింటి ప్రచారంలో(Door to Door Campaign) పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్.. రోడ్‌షో చేపట్టారు.
అధికార పార్టీ లోపాలే అస్త్రాలుగా చేసుకుని ప్రతిపక్ష పార్టీల ప్రచారాలు
తొమ్మిదన్నర సంవత్సరాల్లో నిరుద్యోగులను, ఉద్యోగులను, బడుగు బలహీన వర్గాలను మోసం చేసి.. ఏ ఒక్క హామీ నిలబెట్టుకొని కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలో తెలపాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(BJP Chief Kishan Reddy) ప్రశ్నించారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని ప్రేమ్‌నగర్‌లో.. కమలం పార్టీ అభ్యర్థి కృష్ణయాదవ్‌తో కలిసి.. కిషన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ.. ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గ గడ్డి అన్నారంలో డివిజన్‌లో.. బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి.. పాదయాత్రగా ప్రచారం నిర్వహిస్తూ.. టీలు అమ్ముతూ, క్షవరం చేస్తూ ఆకట్టుకున్నారు.
Telangana Election Raging with Campaigning : సికింద్రాబాద్ నియోజకవర్గం.. మనికేశ్వరి నగర్‌లో.. భారతీయ జనతా పార్టీ(BJP) అభ్యర్థి మేకల సారంగపాణి.. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ అభ్యర్థి జోగురామన్న కుమారుడు.. పురపాలక సంఘం అధ్యక్షుడు జోగు ప్రేమేందర్.. ఆదిలాబాద్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి సాయి మౌనారెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ, తిర్పెల్లి కాలనీల్లో ర్యాలీలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో వాకర్లని కాంగ్రెస్ అభ్యర్థి.. వివేక్ ఓట్లు అభ్యర్థించారు. నిజామాబాద్ జిల్లా ఇంధల్వాయి మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బోధన్ నియోజకవర్గంలో కమలం అభ్యర్థి.. వడ్డి మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Telangana Assembly Elections 2023 : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి తన అనుచరులతో కలిసి.. వర్గల్ మండలంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ.. బీజేపీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ ఓట్లు అభ్యర్థించారు. హైదరాబాద్ నగరంలో కల్లోలం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణపై మరోసారి కన్నేసిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం(State Planning Commission) ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మరోసారి కన్నేసింది : బోయినపల్లి వినోద్ కుమార్
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్‌లో నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశంలో.. గులాబీ పార్టీ అభ్యర్థి సుంకె రవిశంకర్‌తో కలిసి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్.. ప్రజాదీవెన యాత్రలో భాగంగా రామగుండం కార్పొరేషన్‌లో.. పర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో.. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ చెన్నమనేని వికాస్‌రావు.. పాదయాత్ర చేపట్టారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో.. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆయన సతీమణి.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Political Parties Roadshow Campaign in Telangana : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలంలో.. బీజేపీ అభ్యర్థి గుండె విజయరామారావు.. రోడ్‌షో నిర్వహించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో సీపీఎం(CPM) అభ్యర్థి.. తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేపట్టారు. ఇల్లందు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో.. రోడ్ షోలో పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో.. కమలం పార్టీ అభ్యర్థి చల్లమల కృష్ణారెడ్డి.. పలు గ్రామాల్లో పర్యటించారు. యాదాద్రి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు మండలాలలో.. తుంగతుర్తి గులాబీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. గాదరి కిషోర్ రోడ్‌షో నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కడియం రాంచంద్రయ్య.. తుంగతుర్తిలో అభిమానులతో కలసి నృత్యాలు చేస్తూ.. సందడి చేశారు.
విచక్షణతో ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలుస్తారు: కేసీఆర్