ETV Bharat / state

TS EAMCET: ఎంసెట్‌ రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక కీ విడుదల - తెలంగాణ ఎంసెట్​ వార్తలు

ఎంసెట్​ ఇంజినీరింగ్​ రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక కీని పరీక్షల కన్వీనర్‌ గోవర్దన్‌ విడుదల చేశారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యంతరాలను సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

TS EAMCET
TS EAMCET
author img

By

Published : Aug 12, 2021, 5:26 PM IST

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక కీని పరీక్షల కన్వీనర్‌ గోవర్దన్‌ విడుదల చేశారు. ప్రాథమిక సమాధానాలపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యంతరాలను సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. రెస్పాన్స్‌ షీట్లు, కీని వర్సిటీ వెబ్‌సైట్‌లో eamcet.tsche.ac.in అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ వెల్లడించారు.

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు ఈనెల 25వ తేదీన వెలువడనున్నాయి. ఈ మేరకు ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ తేదీని ఖరారు చేసింది. కౌన్సెలింగ్‌ను ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన ఈ నెల 10న ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంసెట్‌ ర్యాంకులను ఈనెల 25న విడుదల చేయాలని నిర్ణయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ సెప్టెంబరు 20వ తేదీతో ముగియనుంది.

తొలి విడత కౌన్సెలింగ్‌ ఎప్పుడంటే...

  • ఆగస్టు 30- సెప్టెంబరు 9: ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం
  • సెప్టెంబరు 4-11: ధ్రువపత్రాల పరిశీలన
  • 4-13: వెబ్‌ ఆప్షన్లు
  • 15న: సీట్ల కేటాయింపు
  • 15-20 వరకు: వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

ఇదీచూడండి: ఇన్​స్టాలో అలాంటి​ కామెంట్లకు ఇకపై చెక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.