TS SI Certificate Verifacation Dates 2023 : రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన తుది రాత పరీక్ష ఫలితాలను ఇప్పటికే విడుదల చేశారు. ఈ క్రమంలోనే అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను.. ఈ నెల 14 నుంచి 26 వరకు పరిశీలించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి తెలిపింది. ఈ మేరకు 18 కేంద్రాలను ఎంపిక చేసినట్లు పేర్కొంది. రోజుకు సగటున దాదాపు 9,000 మంది చొప్పున మొత్తం 1,09,906 మంది పత్రాలను పరిశీలించనున్నట్లు వివరించింది. ఈ మేరకు ఈ నెల 11న ఉదయం 8 గంటల నుంచి 13న రాత్రి 8 గంటల వరకు అభ్యర్థుల ఇంటిమేషన్ లెటర్లను మండలి వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు.
ప్రక్రియ సాగుతుంది ఇలా..
* అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీన.. ఉదయం 9 గంటలకు ఆయా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మండలి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఇంటిమేషన్ లెటర్‌ను తప్పనిసరిగా చూపించాలి.
* దరఖాస్తు వివరాల్లో సవరణలు అవసరం లేని అభ్యర్థులు.. నేరుగా పత్రాల పరిశీలన చేయించుకోవచ్చు. ఒకవేళ సవరణల కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో అర్జీ పెట్టుకొని ఉంటే.. ఆ కాపీని తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. అభ్యర్థి సమక్షంలోనే ఆ సవరణలను మండలి వర్గాలు ఆమోదిస్తాయి.
* కొన్ని పోస్టుల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి.. అదనపు మార్కులు కలపనున్నట్లు నోటిఫికేషన్‌లోనే ప్రకటించారు. ఈ మేరకు అభ్యర్థులు సంబంధిత వివరాలను అందించాలి.
* ఫొటో కాపీలతో పాటు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను అభ్యర్థులు తీసుకురావాలి. వాటిని పరిశీలించిన తదుపరి.. అనంతరం వచ్చే అర్హత పత్రంలో సంతకం చేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది.
Telangana State Police Certificate Verification : ఇటీవలే తెలంగాణలో పోలీసు నియామక తుది రాత పరీక్ష ఫలితాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రకటించింది. ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు అర్హత సాధించిన వారి గణాంకాలను విడుదల చేసింది. మొత్తం విడుదల చేసిన పోస్టులకు గానూ.. 84 శాతం మంది అర్హత సాధించినట్లు పేర్కొంది. ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్, కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.
SI and Constable Certificate Verification Dates : ఎస్‌ఐ సివిల్ 43,708 మంది, ఎస్‌ఐ ఐటీ అండ్ కమ్యూనికేషన్‌కు 729 మంది, కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యూనికేషన్‌కు 4,564 మంది, ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్‌ఐ పోస్టులకు 1,153 మంది, పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఎస్‌ఐ పోస్టులకు 463 మంది, డ్రైవర్, ఆపరేటర్ కానిస్టేబుల్ పోస్టులకు 1,779 మంది, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్‌కు 283 మంది చొప్పున అర్హత సాధించినట్టు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది.
ఇవీ చదవండి: