ETV Bharat / state

నష్టాల నుంచి లాభాల బాట పట్టిన టీఎస్‌ ఆగ్రోస్‌ - telangana varthalu

ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడవడం సర్వసాధారణం. నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛలేకపోవడం... మనకెందుకులే అనే తత్వం, సిబ్బంది అంకితభావంతో పనిచేయకపోవడం, మార్కెట్‌లో పోటీని తట్టుకోలేకపోవడం.. ఇలా అనేక కారణాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడిన దాఖలాలు ఉన్నాయి. ఖాయిలా పడిన పరిశ్రమలకు కొదవలేదు. కానీ, ఇలాంటి ఓ సంస్థను గట్టెక్కించి లాభాల బాట పట్టించి ఆశ్చర్యపరిచారు.

ts agros
నష్టాల నుంచి లాభాల బాట పట్టిన టీఎస్‌ ఆగ్రోస్‌
author img

By

Published : May 13, 2021, 3:57 AM IST

నష్టాల నుంచి లాభాల బాట పట్టిన టీఎస్‌ ఆగ్రోస్‌

రాష్ట్ర వ్యవసాయ యంత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ-టీఎస్​ ఆగ్రోస్‌ రైతు సేవలో నిమగ్నమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాలబాటలో ఉన్న సంస్థ.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏకంగా అస్థిత్వం కోల్పోయిందనే చెప్పాలి. నాలుగేళ్లకుపైగా జీతభత్యాలకు ఎదురు చూసే పరిస్థితులు చవిచూసింది. టీఎస్​ ఆగ్రోస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు కె.రాములు బాధ్యతలు చేపట్టిన తర్వాత దశ తిరిగింది. 6 కోట్ల లావాదేవీలు మాత్రమే కలిగి ఉన్న సంస్థను 151 కోట్లకు చేర్చారు. మార్కెటింగ్‌ వ్యూహాలతో అప్పుల్లోని సంస్థను 2 కోట్ల నికర లాభాల్లోకి తీసుకొచ్చారు. 2014లో 120 ఆగ్రోస్ సేవా కేంద్రాలు ఉండగా.. వాటి సంఖ్య 11 వందలకుపైగా పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లోని అగ్రికల్చర్ బీఎస్సీ, B.sc పట్టభద్రులకు ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. నాణ్యమైన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయాలతో పాటు వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల లభ్యత పెంచేందుకు తోడ్పడ్డారు.

నిరుద్యోగ యువతకు అవకాశాలు

టీఎస్​-ఆగ్రోస్‌ సంస్థ ఎండీ రాములు తీసుకున్న నిర్ణయాల్లో 5 కీలక అంశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఆగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా వ్యాపార అవకాశాలు పెంపొందించారు. హైదరాబాద్‌లో వ్యర్థాలను సేంద్రీయ ఎరువుగా మార్చి 'తెలంగాణ సిరి' బ్రాండ్ పేరిట మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. మామిడి కాయల పక్వానికి ఇథిలిన్‌కు బదులు సురక్షిత ఎన్‌ రైప్ అనే ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చారు. ఆగ్రోస్ సేవా కేంద్రాల్లో త్వరలో చిరుధాన్యాల విక్రయాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయో డీగ్రేడబుల్ బ్యాగుల తయారీ ప్రారంభించిన ఆగ్రోస్‌... తిరుమలలో స్టాల్‌ను నెలకొల్పింది.

రైతుల అవసరాలు తీరుస్తూ..

పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో పాటు అన్ని రకాలుగా రైతుల అవసరాలు తీర్చడంలో టీఎస్‌ ఆగ్రోస్ ముందుంటోంది. అన్నదాతలకు మేలు చేయడమే కాకుండా యువత ఉపాధికి బాటలు వేస్తూ సత్తాచాటుతోంది.

ఇదీ చదవండి: ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన కరోనా బాధితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.