TRT Notification Telangana 2023 : రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు.. ఉపాధ్యాయ నియామక పరీక్ష(Teacher Recruitment Test) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈనెల 20 నుంచి అక్టోబరు 21 వరకు టీఆర్టీ దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరు 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్ చేసుకోవచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లో టీఆర్టీ ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు(TRT Online Exam Centers) ఏర్పాటు చేశారు. అలాగే సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ.. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో టీఆర్టీ ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Telangana Teacher Posts Notification : గత నెల 25న 5,089 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందుకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు తగిన సమాచారం వెబ్సైట్లో పాఠశాల విద్యాశాఖ పొందుపరిచింది.
టీఆర్టీ నోటిఫికేషన్ వివరాలు : టీఆర్టీ నోటిఫికేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబరు 20 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబరు 21వ తేదీని ఆఖరి తేదీ. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లోనే చేయాలి. రాతపరీక్షను కంప్యూటర్ బేస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పరీక్ష కేంద్రాల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. అఫ్లికేషన్ ఫీజు రూ.1000గా నిర్ణయించారు. ఇంకా పూర్తి సమాచారాన్ని దిగువన ఇవ్వడం జరిగింది.
1 | దరఖాస్తులు ప్రారంభం | సెప్టెంబరు 20 |
2 | దరఖాస్తులు చివరి తేదీ | అక్టోబరు 21 |
3 | అర్హత | బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణులై ఉండాలి |
4 | దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
5 | రాతపరీక్ష | కంప్యూటర్ బేస్డ్ విధానం |
6 | అప్లికేషన్ ఫీజు | రూ.1000 |
7 | ఆన్‌లైన్ రాత పరీక్ష | నవంబరు 20 నుంచి 30 వరకు |
8 | వయసు | 18 నుంచి 44 ఏండ్ల లోపు |
9 | వెబ్‌సైట్ | https://schooledu.telangana.gov.in |
10 | పరీక్షా కేంద్రాలు | హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్.. నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం |
TS Tet exam on 15th September : ఈనెల 15న టెట్ పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను సెప్టెంబరు 9 నుంచి విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచనున్నారు.
Telangana Govt Approves 5089 Teacher Posts : డీఎస్సీ ద్వారా 5,089 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి