రాజకీయాలు ఎంపీ రేవంత్ రెడ్డికి పిచ్చోడి చేతిలో రాయిలా మారాయని టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాంటి నాయకులు కాంగ్రెస్‌ను చవకబారు ఎజెండాలతో మరింతగా దిగజారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ఒక రకంగా నూతన సచివాలయం కట్టకుండా సీఎం కేసీఆర్‌ను అడ్డుకునే కుట్రలో భాగంగానే గుప్త నిధుల ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
రాజకీయాల్లో హుందాతనం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్... సచివాలయం గుప్త నిధులపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను తప్పిస్తారంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: లక్షణాలు లేకుండా కరోనా బారిన పడిన వారు ఏం చేయాలి..?