ETV Bharat / state

'24 గంటలూ ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తాం' - అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ల అందజేత

తెరాస యువ నేత, డిప్యూటీ స్పీకర్ పద్మారావ్​ గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ విభిన్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ నియోజకవర్గంలోని ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్ల అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

oxygen cylinders distribution for needy people
'24 గంటలూ ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తాం'
author img

By

Published : Aug 11, 2020, 3:48 PM IST

ఇటీవల కాలంలో అత్యవసర సందర్భాల్లో ఆక్సిజన్ సిలిండర్లు లభించకపోవడం వల్ల ఎంతోమంది కరోనా రోగులు, ఇతర వ్యాధి గ్రస్తులు మృత్యువాత పడిన విషయం మనకు తెలిసిందే. ప్రాణవాయువు అందక ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో తెరాస యువ నేత, తెలంగాణ ఉప సభాపతి శ్రీ తీగుళ్ల పద్మారావు గౌడ్ తనయుడు శ్రీ తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ ఓ విభిన్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అత్యవసర సమయాల్లో సికింద్రాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు పూర్తి ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ మేరకు తన సొంత డబ్బుతో కొన్న ఆక్సిజన్ సిలిండర్లను తన నివాసంలో పెట్టుకున్నారు. 24 గంటలు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామని... అవసరమైన వారు 9959153855 నంబర్​ను సంప్రదించవచ్చని తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ తెలిపారు. లాక్​డౌన్ సమయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్​తో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు 12 వేల కుటుంబాలకు నిత్యావసర సరకులను అందజేశారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.