ETV Bharat / state

ఫలించిన తెరాస వ్యూహం - telangana

శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో తెరాస వ్యూహం ఫలించింది. నలుగురు తెరాస అభ్యర్థులతో పాటు... మిత్రపక్షం ఎంఐఎం అభ్యర్థిని గెలిపించుకుంది. గెలుపొందిన ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.

గెలుపొందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
author img

By

Published : Mar 13, 2019, 6:20 AM IST

Updated : Mar 13, 2019, 8:25 AM IST

గెలుపొందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో నలుగురు తెరాస, ఒకరు ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. తెరాస నేతలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం.. మజ్లిస్​ నేత మిర్జా రియాజ్​ ఉల్​ హసన్​ అఫండీ ఎమ్మెల్సీలుగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి ఓడిపోయారు. ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు బరిలోకి దిగటంతో కొన్ని రోజులుగా నాటకీయ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఓటింగ్​కు దూరంగా విపక్షాలు

నోటిఫికేషన్ విడుదలైన నాటికి నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి తెరాసకు 91 మంది సభ్యులు, ఎంఐఎంకు ఏడుగురు ఉన్నారు. కాంగ్రెస్​కు 19మంది.. తెదేపాకు ఇద్దరు, భాజపాకు ఒకరు ఉన్నారు. ఆ తర్వాత హస్తం ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, హరిప్రియ నాయక్, చిరుమర్తి లింగయ్య, తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గులాబీ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికను బహిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయించగా.. తెదేపా, భాజపా ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉప సభాపతి పద్మారావు సహా తెరాసకు చెందిన 91 మంది.. ఎంఐఎం సభ్యులు ఏడుగురు ఓట్లు వేశారు. మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డికి ఒక్కొక్కరికి ఇరవై మంది.. ఎగ్గె మల్లేషం, మజ్లిస్​ అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ అఫండీకి ఒక్కొక్కరికి 19 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. గెలుపొందిన నేతలు సంతోషం వ్యక్తం చేశారు.

గులాబీ బాస్​ అభినందనలు..

తెరాస ఎమ్మెల్యేలు ఉదయం తెలంగాణ భవన్​కు చేరుకొని.. ముందుగా నమూనా ఓటింగ్​లో పాల్గొన్నారు. అనంతరం బస్సుల్లో అసెంబ్లీకి వెళ్లారు. ఎమ్మెల్సీలుగా గెలుపొందిన నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అనంతరం గెలుపొందినతెరాస ఎమ్మెల్సీలు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

ఇవీ చూడండి: సీఎంను కలిసిన ఎమ్మెల్సీలు

Intro:టిఆర్టి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే వరకు దశలవారీగా పోరాటం చేయాలని గంటలు టిఆర్టి ఉపాధ్యాయ సంఘం నాయకులు నిర్మించారు

Body:రాష్ట్రంలోని ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు టీచర్ నియామకాలు చేపట్టాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్లో టి ఆర్ పి ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఆర్ కృష్ణయ్య ఉపాధ్యాయుల పోరాటానికి మద్దతు ప్రకటించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల అయ్యి ఏడాది గడిచినా టిఆర్టి నియామకాలు నేటికీ భర్తీ చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఒకటే అయినప్పటికీ ఉపాధ్యాయుల పార్టీలో ప్రభుత్వం ఏమాత్రం సాధించడం లేదని ఆయన విమర్శించారు ప్రభుత్వం స్పందించని పక్షంలో అసెంబ్లీ ముట్టడికి వెనుకాడనని ఆయన పేర్కొన్నారు...... ..Byte ....... ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

Conclusion:ఈ ఆర్ టి ఉపాధ్యాయుల నియామకాల ను వెంటనే చేపట్టాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు
Last Updated : Mar 13, 2019, 8:25 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.