ETV Bharat / state

MahilaBandhu: మూడు రోజుల పాటు 'మహిళా బంధు' కేసీఆర్‌ - Womans day news

MahilaBandhu: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో మూడు రోజుల పాటు మహిళా బంధు కేసీఆర్ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. ఇందుకు అనుకూలంగా ఇప్పటికే ప్రణాళికలు రచించింది.

mahilabandhu
mahilabandhu
author img

By

Published : Mar 4, 2022, 6:19 AM IST

MahilaBandhu: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరో తేదీ నుంచి మూడు రోజుల పాటు మహిళా బంధు కేసీఆర్‌ పేరిట రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబురాలను నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ శ్రేణులకు సూచించారు. గురువారం ఆయన మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో తన నివాసం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

మహిళా సంక్షేమంలో మిన్న

‘‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఇప్పటిదాకా సుమారు 10 లక్షల 30 వేల మంది పేదింటి ఆడపడుచులకు రూ.9,022 కోట్లను అందించిన దేశంలోని తొలి ప్రభుత్వం మనదే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిషన్‌ భగీరథతో ఆడబిడ్డల నీటి కష్టాలను దూరం చేశారు. మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్‌ కిట్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 11 లక్షల మందికి రూ.1,700 కోట్ల లబ్ధి కలిగింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు, బాలికలకు ప్రత్యేకంగా గురుకులాలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలను తెచ్చాం. 70 లక్షల ఆరోగ్య కిట్లను విద్యార్థులకు అందించాం. ఇతరులు బేటీ బచావో బేటీ పఢావో అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్న ప్రభుత్వం మనదే. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోనూ మహిళలను ప్రోత్సహిస్తున్నాం. వీటన్నింటిని రాష్ట్రంలోని మహిళలందరికీ తెలియజేయాలి’’ అని కేటీఆర్‌ సూచించారు.

కార్యక్రమాలు ఇలా...

* 6న కేసీఆర్‌కు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మహిళా నేతలు రాఖీలు కడతారు. జిల్లాల్లో ఆయన ఫ్లెక్సీలకు, కటౌట్‌లకు లాంఛనంగా కట్టాలి. పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, ఏఎన్‌ఎంలు, విద్యార్థినులు, ఆశా వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులను సన్మానించాలి. కేసీఆర్‌కిట్‌, షాదీముబారక్‌, థాంక్యూ కేసీఆర్‌ వంటి ఆకారాలతో మానవహారాలు నిర్మించాలి.

* 7న కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ లబ్ధిదారులను ఇంటికెళ్లి కలిసి... వారితో సెల్ఫీలు తీసుకోవాలి.

* 8న నియోజకవర్గ స్థాయిలో మహిళలతో కలిసి సంబురాలు నిర్వహించాలి.

ఇదీచూడండి: KCR Meet Tikait: 'ఫ్రంట్​ గురించి చర్చించలేదు.. ప్రత్యామ్నాయ విధానంలో భాగంగానే.. '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.