అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన ట్రక్కు గుర్తు వల్ల ఓట్లు నష్టపోయినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి గుర్తించింది. తమ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓటమికి ట్రక్కు గుర్తే కారణమన్న ఆ పార్టీ అధిపతి కేసీఆర్.. ఈ విషయాన్ని గతేడాది డిసెంబర్ 27న సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
కేసీఆర్ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ... కారు గుర్తులో మార్పులను కోరింది. దీనిపై ఇవాళ ఎంపీ వినోద్ కొన్ని మార్పులను సమర్పించారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెరాసకు మార్పు చేసిన కారు గుర్తునే కేటాయించనున్నారు.