ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పరుగులు పెట్టించారని తెరాస సెక్రటరీ జనరల్ కె.కేశవరావు (TRS Secretary General K. Keshavarao) ప్రశంసించారు. హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్లీనరీలో కేశవరావు స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, తెలంగాణ పట్ల ఉన్న అవగాహనను వివరించారు. పాలన వికేంద్రీకరణకు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు చేపట్టిన కార్యక్రమాలను కేకే (TRS Secretary General K. Keshavarao) ప్రస్తావించారు.
తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. త్రికరణ శుద్ధితో కేసీఆర్.. రాష్ట్రం అవతరించిన రోజు నుంచి అభివృద్ధి కార్యచరణకు నడుం బిగించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రాథమిక లక్ష్యాలను చాలా వరకు నెరవేరాయంటే అది ఆశామాషీ విషయం కాదు. రాష్ట్రంలో జీవన ప్రమాణాలు జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం కనిపించని వాళ్లే విమర్శిస్తున్నారు. అన్ని ఎన్నికలల్లో తెరాస సాధించిన ఘన విజయమే ప్రజలిచ్చిన తీర్పుకి నిదర్శనం. కేసీఆర్‌కు అణువణువునా ఉన్న తెలంగాణ తపనే గొప్ప ఫలితాల సాధించేందుకు ఉపయోగపడింది. జీఎస్డీపీ రెట్టింపు కావడం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనం.
-కె.కేశవరావు, సెక్రటరీ జనరల్ (TRS Secretary General K. Keshavarao)
అన్ని ఎన్నికల్లోనూ తెరాస ఘన విజయం సాధించడమే కేసీఆర్ పాలనకు ప్రజలిచ్చిన తీర్పని కేకే (TRS Secretary General K. Keshavarao) కితాబిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం కళ్లకు కనపడని వాళ్లే విమర్శిన్నారని కేశవరావు (TRS Secretary General K. Keshavarao) మండిపడ్డారు. కేసీఆర్‌ను విమర్శిస్తున్న నేతలు.. తమ తమ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో తెలంగాణను పోల్చీ చూడాలని సూచించారు. తెలంగాణలో జాతీయ స్థాయికన్నా మెరుగ్గా జీవన ప్రమాణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: TRS Party 20 Years celebrations : తెరాస 20 ఏళ్ల ప్రస్థానం: పోరాట పంథా నుంచి.. ప్రగతి పథంలోకి...