ETV Bharat / state

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన ఆందోళనలు - రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన తెరాస శ్రేణులు

TRS protests against fuel price hike: చమురు, గ్యాస్‌ ధరల పెంపు నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఆధ్వర్యంలో ఆందోళనలు హోరెత్తాయి. రహదారులపై వంటవార్పు చేసి నిరసనలు తెలిపారు. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని నినదించారు.

author img

By

Published : Mar 24, 2022, 8:22 PM IST

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన ఆందోళనలు

TRS protests against fuel price hike: పెట్రోల్‌, డీజిల్‌ సహా గ్యాస్‌ ధరల పెంపుపై తెరాస ధర్నాకు దిగింది. హైదరాబాద్‌ బేగంపేట్‌లోని చీఫ్ రేషనింగ్ కార్యాలయం ఎదుట మంత్రి తలసాని నేతృత్వంలో ఆందోళన చేశారు. ఇందులో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. రోడ్డుపై వంట చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. భాజపా అధికారంలోకి రాకముందు 400 రూపాయలున్న సిలిండర్‌ ప్రస్తుతం వెయ్యికి పెరిగిందన్న నేతలు... చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని.. తక్షణమే రేట్లు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

గద్దె దించే వరకు విశ్రమించం..

"కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారును గద్దె దించే వరకు విశ్రమించం. కేంద్రానికి ప్రజా సమస్యలు పట్టడం లేదు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఇప్పటికే కొవిడ్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగాలు.. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. స్వరాష్ట్ర సాధన తర్వాత కేవలం ఎనిమిదేళ్లలో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 24 గంటల విద్యుత్, సురక్షిత తాగు నీరు, కల్యాణ లక్ష్మి వంటి 150 కార్యక్రమాలు అమలు చేస్తున్నాం." -తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్థక శాఖ మంత్రి

భాజపా హటావో.. దేశ్ కో బచావో

"2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంది. ఇప్పుడు రూ.1050. అప్పుడు లీటరు పెట్రోల్ రూ.60 ఉంటే ఇప్పుడు రూ.109కు పెరిగింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించే వరకు నిరంతరం ప్రశ్నించాలి. తెలంగాణ భాజపా నాయకులు కేంద్రంపై పోరాటం చేయాలి. లేకపోతే ప్రజలంతా 'భాజపా హటావో.. దేశ్ కో బచావో' అంటూ నినదిస్తారు." - కవిత, ఎమ్మెల్సీ

ఖాళీ సిలిండర్లతో నిరసన

ఫిలింనగర్‌ శంకర్‌ విలాస్‌ చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిరసనలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు. కేంద్రం సామాన్యుడిపై ఆర్థికభారం మోపుతోందని ఆరోపించారు.ఎంజే మార్కెట్ కూడలిలో ఖాళీ సిలిండర్లతో తెరాస శ్రేణులు నిరసన తెలిపారు. భాజపా ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పీర్జాదిగూడ, అన్నోజిగూడ, ఘట్​కేసర్ గ్యాస్ సిలిండర్లతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్రం రాయితీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మంగల్‌హాట్ డివిజన్‌లో కట్టెల పొయ్యిపై మహిళలు వంటలు చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు 65వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

రేట్లు తగ్గించే వరకు పోరాటం చేస్తాం..

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లో చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. రేట్లు తగ్గించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హనుమకొండలో ఖాళీ సిలిండర్లతో ప్రదర్శన చేపట్టిన చీఫ్‌ విప్‌ వినయభాస్కర్‌.. భాజపా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. పరకాలలో తెరాస నేతలు కడియం శ్రీహరి, చల్లా ధర్మారెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. మహిళలు గ్యాస్ బండల చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడారు. ఖమ్మంలో మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఇల్లందు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఖాళీ సిలిండర్లు, ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో సిలిండర్ నెత్తిన పెట్టుకొని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆందోళన చేశారు. నల్గొండ, వరంగల్‌, సిరిసిల్లలోనూ నిరసనలు హోరెత్తాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.