నాంపల్లిలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్తో కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ పలువురికి సభ్యత్వాలు అందజేశారు. సభ్యత్వాల నమోదుకు మిగిలిన నాలుగు రోజులను సద్వినియోగం చేసుకోవాలని బండి రమేష్ పార్టీశ్రేణులను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై స్పందన సభ్యత్వాలలో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఎంత శ్రమించి పనిచేస్తే అంతమంచి ఫలితాలు ఆశించవచ్చని... కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం బండి రమేష్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరిపాయి.
ఇవీ చూడండి:కొండగట్టు వెళ్లే బస్లో 125మంది... సీజ్