తెరాస జిల్లా కార్యాలయాల శంకుస్థాపన ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం పది నుంచి 11 గంటల మధ్య ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు. ఆయా జిల్లాల మంత్రులే భూమి పూజ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. మంత్రులు లేని చోట ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు కార్యక్రమం చేయాలని చెప్పారు. స్థలాలు, కార్యాలయ నమూనాలు సిద్ధంగా ఉండడం, నిర్మాణానికి పార్టీ నిధులు ఇస్తున్నందున... వేగంగా భవనాలు పూర్తి చేయాలని నిర్దేశించారు.
ఇదీ చూడండి : కాళేశ్వరంపై భాజపా మాటలు అవగాహనలేనివి