ప్రగతి భవన్లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డు పరిధిలోకి తీసుకువస్తూ... కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఈ అంశంతో పాటు పార్లమెంట్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి: Niranjan reddy comments: హమాలీ పని అంటే ఉపాధి కాదా?