TRSPP Meeting: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెరాస ఎంపీలకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ తెరాస సభ్యులు భేటీకి హాజరు కానున్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలు, పునర్విభజన హక్కులు, నూతన ప్రాజెక్టులు, సంస్థలపై పార్లమెంటులో పోరాడాలని ఇప్పటికే నిర్ణయించారు.
రాష్ట్రానికి జాతీయ విద్యా సంస్థలు, నూతన ప్రాజెక్టులు, నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారు. రాష్ట్రానికి సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పెండింగులో ఉన్న అంశాలపై కూడా ఎంపీలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
ఇదీ చదవండి: