ETV Bharat / state

TRS MPS: యాసంగి వరి ధాన్యం కొంటారా? కొనరా?: తెరాస ఎంపీలు

TRS MPS :యాసంగిలో తెలంగాణ ధాన్యం కొంటారో, లేదో స్పష్టం చేయాలని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం సేకరిస్తారో చెప్పాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తమను అవమానించేలా మాట్లాడారని ఎంపీలు ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీలు మాట్లాడారు.

DELHI TRS MPS
కేంద్రంపై తెరాస ఎంపీల విమర్శలు
author img

By

Published : Nov 30, 2021, 9:52 PM IST

TRS MPS: రాష్ట్రంలో యాసంగిలో పండే పంటను కొంటరా లేదా అనేది స్పష్టం చేయాలని తెరాస ఎంపీలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం సేకరిస్తారో సంబంధిత శాఖ మంత్రి తేల్చిచెప్పాలని... అనవసరపు రాజకీయాలు చేయొద్దని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలందరూ కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ వద్దకు వెళ్తే అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు.

దిల్లీలో నిర్వహించిన సమావేశంలో తెరాస ఎంపీలు

మెమేప్పుడూ భాజపాకు వ్యతిరేకమే: కేకే

KK ON BJP: కేంద్రంలోని భాజపాకు మేమెప్పుడూ వ్యతిరేకమేనని తెరాస ఎంపీ కె.కేశవరావు అన్నారు. దేశానికి మంచి జరిగే బిల్లులకు మద్దతు ఇచ్చామని ఆయన తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఓటు వేశామని పేర్కొన్నారు. గతంలో కూడా విపక్షాల సమావేశాల్లో పాల్గొన్నట్లు ఎంపీ వెల్లడించారు. విపక్షాలన్నీ ఐక్యంగా భాజపాను నిలదీస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని యార్డుల్లో ధాన్యం నిండిపోయిందని తెలిపారు. ధాన్యం సేకరణపై జాతీయ సమగ్ర విధానం ఉండాలని డిమాండ్ చేశారు. రైతులు, ధాన్యం విషయంలో వివక్ష ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో ఎంత మొత్తంలో ధ్యానం సేకరిస్తారో చెప్పాలని కేకే కోరారు.

'కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర భాజపా నాయకులు సిగ్గుపడాలి. కేంద్రమంత్రి సీఎం కేసీఆర్, మంత్రులను అవమాన పరచినప్పటికీ ధాన్యం కొనమని అడుగుతున్నాం. అది చెప్పకుండా మమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు. రాష్ట్ర భాజపా నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారు. మేం ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాం. మీ స్టాండ్ ఏంటి? తెలంగాణలో యాసంగిలో పండించిన ధాన్యం కొంటారా.. కొనరా చెప్పండి. అది చెప్పకుండా కాలయాపన చేస్తారా? భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రంలోని చేతగానీ మోదీ ప్రభుత్వం ఏదో రాజకీయం చేస్తోంది. ఎంత కొంటారో చెప్పండి. మాది న్యాయమైన కోరిక. మీ రాజకీయాలు మా దగ్గర చెల్లవు.' -బొర్లకుంట వెంకటేశ్‌ నేత, తెరాస ఎంపీ

'భాజపా నాయకులకు మరీ మరీ చెప్తా ఉన్నాం. మిమ్మల్ని ఉరికిచ్చి తన్నే రోజు వస్తది గుర్తుంచుకోండి. అరె నీ గుండుమీద మొట్టి కాయేస్తుంటే సోయిలేదు. వాళ్లు చెప్పిందే చెప్తావ్. సోయి ఉన్న మాటలు మాట్లాడకుండా ఏదేదో చెప్తావ్. నీకు అంత దమ్ముంటే నువ్వు రా. మేము కూడా వస్తాం రైతుల దగ్గరికి. మీరు ఎంత ధాన్యం కొంటారో మాకు చెప్పండి. మా రైతులకు మేం చెబుతాం. మీకు వాత పేట్టే రోజు వస్తది. మా డిమాండ్ తప్పకుండా తీర్చాలి.'

- మాలోతు కవిత, తెరాస ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.