న్యాయవాదులు.. మలి దశ ఉద్యమం నుంచి అనేక సందర్భాల్లో కేసీఆర్కు అండగా నిలిచారని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. న్యాయవాదులను కలిసి ఓటు అభ్యర్థించారు.
లాయర్ల సంక్షేమం కోసం ఫండ్ ఏర్పాటు చేసిన తెరాస ప్రభుత్వానికి ఓటర్లు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు పల్లా. సీఎం కేసీఆర్కు.. తాను సైనికుడినని పేర్కొన్నారు. పట్టభద్రుల సంక్షేమం, అభివృద్ధి.. జోడు ఎడ్లలా సాగాలంటే తనకు ఓటేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల కోసం కాకుండా.. ప్రజల కోసం పనిచేయండి : కేటీఆర్