ETV Bharat / state

'రాష్ట్రం పచ్చబడుతుంటే.. జీవన్​ రెడ్డి కళ్లు ఎర్రబడుతున్నాయి' - కాళేశ్వరం

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై తెరాస ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్​, సంజయ్​ విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదనడం దారుణమని ఆరోపించారు. ​కాళేశ్వరంతో రాష్ట్రం పచ్చబడుతుంటే.. జీవన్​ రెడ్డి కళ్లు ఎర్రబడుతున్నాయని మండిపడ్డారు. జీవన్​ రెడ్డి తన సీనియార్టీకి తగినట్లు హుందాగా వ్యవహరించాలని కోరారు.

జీవన్​ రెడ్డి కళ్లు ఎర్రబడుతున్నాయి
author img

By

Published : Sep 21, 2019, 7:57 AM IST

Updated : Sep 21, 2019, 8:04 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అర్థరహితంగా మాట్లాడుతున్నారని చొప్పదండి, జగిత్యాల ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదనడం దారుణమన్నారు. కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడుతుంటే... జీవన్ రెడ్డి కళ్లు ఎర్రబడుతున్నాయని ధ్వజమెత్తారు. చెరువులు నిండడం, భూగర్భ జలాలు పెరగడం జీవన్ రెడ్డికి కనిపించడం లేదా అని తెరాస ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందని జీవన్ రెడ్డి భావిస్తున్నట్లున్నారని.. ఇకపై అలాగే మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

జీవన్​ రెడ్డి కళ్లు ఎర్రబడుతున్నాయి

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో 'హుజూర్​నగర్' చిచ్చు.. నేతల మధ్య మాటల యుద్ధం

Intro:Body:Conclusion:
Last Updated : Sep 21, 2019, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.