ETV Bharat / state

30 లక్షలు దాటిన తెరాస సభ్యత్వాలు - Trs latest updates

తెరాస సభ్యత్వాల సంఖ్య శనివారానికి 30 లక్షలు దాటింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి సమాచారం అందింది. రాష్ట్రవ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఈనెల 12న మొదలైన కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.

ముమ్మరంగా సాగుతోన్న తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం

author img

By

Published : Feb 21, 2021, 6:52 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వాల సంఖ్య శనివారానికి 30 లక్షలు దాటింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి సమాచారం అందింది. రాష్ట్రవ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఈనెల 12న మొదలైన కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ నిర్దేశించిన గడువులో వారం రోజులు పూర్తి కాగా మరో వారం మిగిలి ఉంది. ప్రతి నియోజకవర్గానికి 50 వేలకు పైగా సభ్యత్వాలు గల పుస్తకాలను అందజేశారు.

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ నియోజకవర్గం వారం రోజుల్లోనే 50 వేల సభ్యత్వాలను నమోదు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ‘రాష్ట్రంలో సభ్యత్వ నమోదులో ముందు నిలవడం ఆనందంగా ఉంది. కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం’ అని జూబ్లిహిల్స్‌ ఎమ్మెల్యే గోపీనాథ్‌, పార్టీ ఇన్‌ఛార్జి శంబీపూర్‌ రాజులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 80 వేల సభ్యత్వ నమోదుపై దృష్టి సారించామన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రతి నియోజకవర్గంలో లక్ష్యానికి మించి సభ్యత్వాలను నమోదు చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు కోరారు. ఈ కార్యక్రమాన్ని శనివారం ఆయన సమీక్షించారు. పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. గోపీనాథ్‌, శంబీపూర్‌ రాజులను అభినందించారు. రాష్ట్రమంతటా ఇదే ఉత్సాహం సాగాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సభ్యత్వ నమోదును ఈనెల 27 వరకు పూర్తి చేయాలన్నారు. త్వరలో మరోసారి సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: హత్యతో సంబంధం లేదన్న పుట్ట మధు.. ఎవర్నీ వదలబోమన్న సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.